కేవలం సినిమాలే కాకుండా ఆ పని చేస్తూ కోట్లు సంపాదిస్తున్న నటి హేమ - బయటకు వచ్చిన సంచలన నిజాలు!

ప్రస్తుతం బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Update: 2024-05-25 03:20 GMT

దిశ, సినిమా: ప్రస్తుతం బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే ఇందులో పలువురు సినీ సెలబ్రిటీలు ఉన్నట్లు బెంగళూరు పోలీసులు నిర్ధారించిగా అందులో టాలీవుడ్ నటి హేమ కూడా ఉన్నట్లు పోలీసులు బ్లడ్ శాంపిల్స్ సేకరించి డ్రగ్స్ తీసుకున్నట్లు కన్ఫర్మ్ చేశారు. అలాగే ఆమె తన పేరును కృష్ణవేణిగా చెప్పుకుందని అసలు నిజాలు బయట పెట్టారు.

దీంతో హేమకు సంబంధించిన పలు పాత ఇంటర్వ్యూలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీనిలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో హేమ.. తన ఆస్తుల వివరాల గురించి చెప్పుకొచ్చింది. అయితే ఆ ఇంటర్వ్యూలో భాగంగా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న హేమ చాలా లగ్జరీ లైఫ్‌ని గడుపుతుంది. ఇదంతా సినిమాల వల్లేనా అని అడగగా.. కేవలం సినిమాల పైనే ఆధారపడి ఉండుంటే తన జీవితం వేరేలా ఉండేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

‘‘నా భర్త కెమెరా మ్యాన్, మా అమ్మ వాళ్ళు కూడా ఉన్నవాళ్లే. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఒంటినిండా నగలు వేసుకొని తిరిగేదాన్ని. ఊరిలో కూడా మాకేం లోటు లేదు. కిట్టీ పార్టీలతో కూడా సంపాదిస్తున్నాను. కేవలం ఇండస్ట్రీ పైనే ఆధారపడి సంపాదించడం కష్టం’’ అని చెప్పుకొచ్చింది హేమ. కాకపోతే అందరూ అనుకుంటున్నట్టుగా తనకు రూ.150, రూ.200 కోట్ల ఆస్తులు లేవని.. ఉన్నదాంట్లో హ్యాపీగా ఉన్నానని చెప్పుకొచ్చింది . అంత ఆస్తి ఉంది కాబట్టే బెంగళూరు రేవ్ పార్టీ ఎంట్రీ కోసం రూ.5 కోట్లు ఇవ్వగలిగిందని విమర్శిస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం నెట్టింట ఈ వార్త తెగ వైరల్ అవుతోంది.

Similar News