రేవ్ పార్టీ ట్విస్ట్ : షాకింగ్.. ఆయనతో నటి హేమ లవ్ స్టోరీ.. బయటకొచ్చిన అసలు నిజాలు..

బెంగళూరు రేవ్ పార్టీ నటి హేమను వారం రోజులుగా వార్తల్లో నిలిచేలా చేస్తుంది. ఇందులో పలువురు నటీనటులు పాల్గొన్నారని న్యూస్ వచ్చినా..

Update: 2024-05-25 08:58 GMT

దిశ, సినిమా: బెంగళూరు రేవ్ పార్టీ నటి హేమను వారం రోజులుగా వార్తల్లో నిలిచేలా చేస్తుంది. ఇందులో పలువురు నటీనటులు పాల్గొన్నారని న్యూస్ వచ్చినా.. హేమ మాత్రం ఉన్నట్లు పోలీసులు తేల్చేశారు. దీంతో హేమ గతాన్ని తవ్వుతున్నారు నెటిజన్లు. ఈ క్రమంలోనే ఆమె లవ్ స్టోరీ బయటపడింది. ఇంతకీ ఆమె ప్రేమ్ కథ ఎప్పుడు ఎలా మొదలైంది? ఎవరిని పెళ్లాడింది? అనే విషయాలపై పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంది.

కాగా సినీ ప్రపంచంతో పరిచయమున్న వ్యక్తినే ప్రేమించి, పెళ్లి చేసుకుంది హేమ. దూరదర్శన్ లో వర్క్ చేసేటప్పుడు సయ్యద్ జాన్ అహ్మద్ అనే వ్యక్తిని కలిసింది నటి. అక్కడ అసిస్టెంట్ కెమెరామెన్ గా పనిచేస్తున్న సయ్యద్.. తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోయాడు. ఫస్ట్ మీట్ లోనే పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడు. దీంతో ఆయన సిన్సియారిటీ మెచ్చిన హేమ.. పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా నటి సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించిన విషయం తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా రాజోలుకు చెందిన హేమ అసలు పేరు కృష్ణవేణి కాగా తొలి సినిమా బాలకృష్ణ ' భలేదొంగ ' కావడం విశేషం.

Similar News