100సార్లు చిరంజీవి బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేసిన నటుడు.. పట్టలేని సంతోషంలో మెగాస్టార్ చేసిన పనికి అంతా షాక్
తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి బ్లడ్ బ్యాంకుకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 26 ఏళ్లుగా లక్షలాది మందికి
దిశ, సినిమా : తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి బ్లడ్ బ్యాంకుకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 26 ఏళ్లుగా లక్షలాది మందికి రక్తనిధులు ఉచితంగా దానం చేసి ఎందరో ప్రాణాలను నిలబెట్టిన బ్లడ్ బ్యాంక్ స్థాపకులు మెగాస్టార్ చిరంజీవికి అండదండగా నిలుస్తున్నారు అభిమానులు. కాగా ఈ బ్లడ్ బ్యాంకుకి వెన్నుదన్నుగా నిలుస్తోన్న లక్షలాది రక్తదాతలలో ప్రముఖ నటుడు మహర్షి రాఘవ ఒకరు. మెగాస్టార్‌పై అభిమానంతో 1998 అక్టోబర్ 2వ తేదిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ అయినప్పుడు రక్తదానం చేసిన తొలి వ్యక్తి మురళీ మోహన్ కాగా రెండో వ్యక్తి మహర్షి రాఘవ కావటం విశేషం. అయితే ఇప్పుడు మహర్షి రాఘవ హండ్రెడ్ టైమ్స్ రక్తదానం చేసి రికార్డ్ క్రియేట్ చేశాడు.
100వ సారి రక్తదానం చేస్తున్నప్పుడు కచ్చితంగా తాను కూడా వస్తానని అప్పట్లో రాఘవకు చిరంజీవి మాటిచ్చారు.అయితే అనుకోకుండా ఆ సమయంలో ఆయన చెన్నైలో ఉండటంతో.. హైదరాబాద్ చేరుకున్న వెంటనే ప్రత్యేకంగా ఇంటికి ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. మూడు నెలలకు ఓ సారి 100 సార్లు రక్తదానం చేయటం గొప్పవిషయమని.. ఇలా రక్తదానం చేసిన వ్యక్తుల్లో మహర్షి రాఘవ ప్రప్రథముడని అభినందించారు.ఆయనతో పాటు ఇదే సందర్భంలో ఫస్ట్ రక్తదానం చేసిన మురళీ మోహన్‌ను కూడా కలిశాడు చిరు.