Aamir Khan: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అమీర్.. అప్పుడే సినిమా అనౌన్స్ చేస్తాడట

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ తన రీ ఎంట్రీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

Update: 2023-05-31 08:25 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ తన రీ ఎంట్రీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. పిల్లల సంరక్షణలో భాగంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆయన.. ‘లాల్ సింగ్ చద్దా’ తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఇంకా ప్రకటించలేదు. అయితే రీసెంట్‌గా ఓ సమావేశంలో మాట్లాడుతూ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. ‘నేను ఈ రోజుల్లో తక్కువ పని చేస్తున్నా. కుటుంబంతోనే ఎక్కువ సమయం గడుపుతున్నా. అయితే సినిమా కథపట్ల ఎప్పుడైతే ఎమోషనల్‌గా ఫీల్ అవుతానో అపుడే నా తదుపరి మూవీ అనౌన్స్ చేస్తా’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం అమీర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న స్పానిష్ సినిమా ‘కాంపియోన్స్’రీమేక్‌లో ఓ అతిథి పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం.

Also Read.

Bandla Ganesh: ఘట్టమనేని కృష్ణ జయంతి సందర్భంగా ట్వీట్ చేసిన బండ్ల గణేష్ 

శ్రద్ధా క్యారెక్టర్‌పై డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. వద్దన్నా ఫోన్ చేస్తుందట

Tags:    

Similar News