హీరో కళ్యాణ్ రామ్ ‘NKR-21’ షూటింగ్ సెట్లో భారీ అగ్ని ప్రమాదం.. అసలు ఏం జరిగిందంటే?
ఈ మధ్య కాలంలో సినిమా షూటింగ్ సెట్స్‌లో భారీ అగ్రిప్రమాదాలు చోటుచేసుకుంటూ అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో సినిమా షూటింగ్ సెట్స్‌లో భారీ అగ్రిప్రమాదాలు చోటుచేసుకుంటూ అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల ఎన్టీఆర్ దేవర సినిమా సెట్లో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా, నందమూరి హీరో కళ్యాణ్ రామ్ చేస్తున్న కొత్త సినిమా ‘NKR-21’ సెట్లో అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం. పదిరోజుల పాటు జరిగే షూట్ కోసం వేసిన సెట్లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 9 రోజుల షూట్ పూర్తి అయిన తర్వాత రాత్రి సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అయితే ఈ ప్రమాదం కారణంగా నిర్మాతలకు ఏకంగా రూ. 4 కోట్లు నష్టపోయినట్లు తెలుస్తోంది. కానీ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కాగా.. కళ్యాణ్ రామ్, ప్రదీప్ చిలుకూరి కాంబోలో ‘NKR-21’ వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తుండగా.. సీనియర్ స్టార్ హీరోయిన్ విజయశాంతి కీలక పాత్రలో కనిపించనుంది.
దీనిని వెంకయ్య చౌదరి, అశోక్ వర్ధన్, సునీల్ బలుసు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుండగానే ప్రమాదం జరగడంతో మేకర్స్ అయోమయంలో పడిపోయారు. అయితే ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.