20 ఏళ్ళకే బాయ్ ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకున్న ప్రముఖ నటి..

'స్ట్రేంజర్ థింగ్స్' అనే వెబ్ సిరీస్‪‌తో పాపులారిటీ సంపాదించిన హాలీవుడ్ నటి మిల్లీ బాబీ బ్రౌన్ అందరికీ సుపరిచితమే.

Update: 2024-05-26 08:25 GMT

దిశ, సినిమా: 'స్ట్రేంజర్ థింగ్స్' అనే వెబ్ సిరీస్‪‌తో పాపులారిటీ సంపాదించిన హాలీవుడ్ నటి మిల్లీ బాబీ బ్రౌన్ అందరికీ సుపరిచితమే. దీనితో పాటు పలు సినిమాలు, ఇతర సిరీసులు కూడా చేసి మెప్పించింది. అయితే టీనేజ్లోనే స్టార్ డమ్ సొంతం చేసుకున్న ఈ భామ.. గత కొన్నేళ్ల నుంచి మోడల్ జేక్ బొంగివోయ్‌తో రిలేషన్‌లో ఉన్న పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం బయటకు వచ్చింది.

ఇదిలా ఉండగా బేసిక్‌గా సినిమా హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. కెరీర్‌లో సెట్ అయ్యాక లేట్‌గా పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అలాంటిది ఈ బ్యూటీ 20 ఏళ్లకే తన 22 ఏళ్ల ప్రియుడితో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. గతవారం ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక చాలా సీక్రెట్‌గా జరిగింది. ఇప్పుడు ఈ విషయం తెలిసి ఆమె ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. మరోవైపు హ్యాపీగానూ ఫీలవుతున్నారు. వీళ్ల పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే సడన్‌గా వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారనే న్యూస్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.


Similar News