Basara IIIT: మరోసారి ఆందోళన బాట పట్టిన ట్రిపుల్ ఐటీ విద్యార్థులు

Basara IIIT Student Agitation In Front of the Administrative Office| బాసర ట్రిపులైటిలో విద్యార్థులు మళ్ళీ ఆందోళన బాట పట్టారు.. గత నెలరోజుల క్రితం ఇక్కడ వేలాది మంది విద్యార్థుల ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా.. విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి

Update: 2022-07-16 10:37 GMT

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: Basara IIIT Student Agitation In Front of the Administrative Office| బాసర ట్రిపులైటిలో విద్యార్థులు మళ్ళీ ఆందోళన బాట పట్టారు.. గత నెలరోజుల క్రితం ఇక్కడ వేలాది మంది విద్యార్థుల ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా.. విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి చర్చించి విద్యార్థుల డిమాండ్లు నెల రోజుల్లో తీరుస్తామన్న హామీతో ఆందోళన విరమించారు. మంత్రి హామీ ఇచ్చి నెల తిరక్కుండానే పలుమార్లు ఇక్కడ సమస్యలు తలెత్తాయి.. తాజాగా నిన్న త్రిబుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్‌తో విధ్యార్థులు అస్వస్తతకు గురైనారు.. అందులో కొంతమంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు మూకుమ్మడిగా ట్రిపులైటి క్యాంపస్‌లోని పరిపాలనా విభాగం భవనం వద్ద ఆందోళనకు పూనుకున్నారు.

ఏమాత్రం నాణ్యత లేని, గడువు తీరిన ఆహార సరుకులను ముందు పెట్టుకుని డైరెక్టర్ ఛాంబర్ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. మెస్ కాంట్రాక్టర్ లు, త్రిపులైటీ అధికారుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇక్కడి మెస్‌లలో నిబంధనల ప్రకారం ఆహారమందించటం లేదని, నాణ్యతా ప్రమాణాలు అసలు పాటించడం లేదని విద్యార్థులు, ఫుడ్ ప్యానల్ టీం ట్రిపులైటి అధికారులకు ఫిర్యాదు చేశారు. పారిశుధ్యం సరిగా లేక వంటశాల, భోజనశాలలో దుర్వాసను వస్తోందంటూ ఫుడ్ ప్యానల్ టీం ట్రిపులైటి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదివరకెన్నోమార్లు రాతపూర్వకంగా ఫిర్యాదులు చేసినప్పటికీ ఫలితం లేకపోవడం గమనార్హం.

ఇది కూడా చదవండి: కేంద్రం దెబ్బకు డిఫెన్స్‌లో కేసీఆర్ సర్కార్?

Tags:    

Similar News