ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త!

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యాన్ని(డీఏ) పెంచుతూ ప్రధాని మోదీ నేతృత్వంలోని మంత్రివర్గం నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ నిర్ణయంతో 17 శాతంగా ఉన్న డీఏ 4 శాతం పెరిగి 21 శాతం డీఏను ఉద్యోగులు అందుకోనున్నారు. పెంచిన డీఏ 2020, జనవరి 1 నుంచి వర్తిస్తుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా దేశంలోని 48 […]

Update: 2020-03-13 07:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యాన్ని(డీఏ) పెంచుతూ ప్రధాని మోదీ నేతృత్వంలోని మంత్రివర్గం నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ నిర్ణయంతో 17 శాతంగా ఉన్న డీఏ 4 శాతం పెరిగి 21 శాతం డీఏను ఉద్యోగులు అందుకోనున్నారు. పెంచిన డీఏ 2020, జనవరి 1 నుంచి వర్తిస్తుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా దేశంలోని 48 లక్షల మంది ఉద్యోగులు, 65 లక్షల మంది ఫించనుదారులు ప్రయోజనాలను పొందనున్నారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంపు ద్వారా ప్రభుత్వానికి రూ. 14,595 కోట్ల అదనపు భారం తప్పదని మంత్రి వివరించారు. 2016లో ఏడవ వేతన సంఘం సిఫార్సులను మోదీ ప్రభుత్వం అమలు చేసిన సమయంలో వేతనాలు పెరిగాయి. తాజా నిర్ణయంతో దేశ వ్యాప్తంగా మొత్తం 1.13 కోట్ల కుటుంబాలకు ప్రయోజనాలు అందుతాయని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు.

Tags: 7th Pay Commission, 7th Pay Commission Recommendations, Seventh Pay Commission, 7th Pay Commision 2019, 7th Pay Commision Minimum Salary

Tags:    

Similar News