‘కేసీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి’

దిశ, జగిత్యాల: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ప్రగతిభవన్‌లో ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించడం ఎన్నికల నియమాళిని ఉల్లంఘించడమేనని, అందుకు కేసీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాలలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పీఆర్సీపై ప్రభుత్వం వేసిన త్రిమెన్ కమిటీ నివేదిక రాకముందే ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించి, 29శాతం ఇస్తానని చెప్పి లీక్ చేయడం ఎన్నికల కమిషన్ నిబంధనలను […]

Update: 2021-03-19 09:34 GMT

దిశ, జగిత్యాల: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ప్రగతిభవన్‌లో ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించడం ఎన్నికల నియమాళిని ఉల్లంఘించడమేనని, అందుకు కేసీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాలలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పీఆర్సీపై ప్రభుత్వం వేసిన త్రిమెన్ కమిటీ నివేదిక రాకముందే ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించి, 29శాతం ఇస్తానని చెప్పి లీక్ చేయడం ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘించడమేనని అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి దుబ్బాక ఎన్నిక గుణపాఠం చెప్పిందన్నారు. గతంలో జరిగిన పొరపాటు చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని ఓటర్లను ప్రలోభాలకు గురిచేసిందన్నారు. ఉద్యోగ సంఘాలు ప్రగతి భవన్‌కు పోలేదని అనడం హాస్యస్పదమని, అక్కడ సీసీ పుటేజీని చూస్తే అర్థమవుతుందన్నారు.

Tags:    

Similar News