కోఆపరేటివ్ అధికారిపై ఎమ్మెల్సీ బాలసాని ఆగ్రహం

దిశ ప్రతినిధి, ఖమ్మం: ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ జిల్లా కోఆపరేటివ్ అధికారిపై ఫైర్ అయ్యారు. కొత్తగూడెం క్లబ్‌లో జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య అధ్యక్షతన మంగళవారం జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కోపరేటివ్ అధికారి వెంకటేశ్వర్లుకు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మధ్య భద్రాచలంలోని ఓ ఇసుక ర్యాంపు విషయంలో పరస్పర ఆరోపణల పర్వం కొనసాగింది. జిల్లా సహకార అధికారి పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడని ఎమ్మెల్సీ అనగా, కోపరేటివ్ అధికారి వెంకటేశ్వర్లు ఎమ్మెల్సీ బాలసాని […]

Update: 2021-09-21 11:21 GMT

దిశ ప్రతినిధి, ఖమ్మం: ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ జిల్లా కోఆపరేటివ్ అధికారిపై ఫైర్ అయ్యారు. కొత్తగూడెం క్లబ్‌లో జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య అధ్యక్షతన మంగళవారం జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కోపరేటివ్ అధికారి వెంకటేశ్వర్లుకు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మధ్య భద్రాచలంలోని ఓ ఇసుక ర్యాంపు విషయంలో పరస్పర ఆరోపణల పర్వం కొనసాగింది. జిల్లా సహకార అధికారి పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడని ఎమ్మెల్సీ అనగా, కోపరేటివ్ అధికారి వెంకటేశ్వర్లు ఎమ్మెల్సీ బాలసాని తనను వేధిస్తున్నారంటూ సభలోనే చెప్పడంతో బాలసాని ఒక్కసారిగా మండిపడ్డారు.. ‘‘ఏం మాట్లాడుతున్నావ్.. ఎవరితో మాట్లాడుతున్నావ్.. నేను ఓ ప్రజాప్రతినిధిని’’ అంటూ ఫైర్ అయ్యారు. దీంతో సభావేదికపైనే ఉన్న కలెక్టర్ అనుదీప్ కలుగజేసుకుని తాను స్వయంగా ఎంక్వైరీ చేస్తానని ఎమ్మెల్సీని సముదాయించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, అదనపు కలెక్టర్ కె.వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ విద్యాలత హాజరయ్యారు.

Tags:    

Similar News