‘సమస్యల పరిష్కారానికి నేనే వస్తా’

దిశ, ఎల్బీనగర్: నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి ప్రజల వద్దకు తానే వస్తానని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నగరంలో రోజురోజుకూ కరోనా వైరస్ విజృంభిస్తోందని, మాస్కులు పెట్టుకున్నాం.. కరోనా అంటుకోదు, అనే భ్రమల్లో ప్రజలు వీధుల్లోకి వస్తున్నారన్నారు. ప్రభుత్వం కరోనా నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, భౌతికదూరం పాటించకుండా, శానిటైజేషన్ చేసుకోకుండా, మాస్కులను తీసేసి మాట్లాడుతూ. షాపింగులు చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో […]

Update: 2020-06-15 08:54 GMT

దిశ, ఎల్బీనగర్: నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి ప్రజల వద్దకు తానే వస్తానని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నగరంలో రోజురోజుకూ కరోనా వైరస్ విజృంభిస్తోందని, మాస్కులు పెట్టుకున్నాం.. కరోనా అంటుకోదు, అనే భ్రమల్లో ప్రజలు వీధుల్లోకి వస్తున్నారన్నారు. ప్రభుత్వం కరోనా నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, భౌతికదూరం పాటించకుండా, శానిటైజేషన్ చేసుకోకుండా, మాస్కులను తీసేసి మాట్లాడుతూ. షాపింగులు చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో కరోనా మహమ్మారి విజృంభించే అవకాశం ఎక్కువగా ఉందని, అత్యవసర పనులకే బయటికి రావాలని, కరోనా జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ చేసిన విజ్ఞప్తిని ప్రజలు తప్పకుండా పాటించాలన్నారు. అత్యవసరమైతే తప్ప నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు తన కార్యాలయానికి రావాలని, కాలనీల్లో సమస్యల పరిష్కారానికి తానే స్వయంగా వస్తానని స్పష్టంచేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోనే కరోనా అధికంగా విస్తరిస్తుందన్న విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. గచ్చిబౌలి స్టేడియాన్ని కరోనా రోగుల కోసం 1500 బెడ్లతో వైద్యసేవలకు అత్యాధునికంగా సిద్ధం చేశారని తెలిపారు. నిమ్స్ ఆస్పత్రిలో వైద్యులకు కరోనా రావడంతో 60శాతం సిబ్బంది విధులకే హాజరుకావడం లేదని, గాంధీలో కరోనా వైద్య సేవలందించలేక వైద్యులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. లాక్‌డౌన్‌లో నియోజకవర్గంలోని పేద, నిరుపేద, వలస కార్మికులకు తమవంతు సహాయసహకారాలు అందించామని, కరోనా వ్యాప్తి చెందకుండా అన్నీ చర్యలు తీసుకున్నామని వివరించారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News