నన్ను వేరు చేసి అవమానించారు : ఎమ్మెల్యే సీతక్క

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ నేతలపై ములుగు ఎమ్మెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆమె ఓ మీడియాతో ఛానల్‌తో మాట్లాడుతూ.. తాను శాసనసభా పక్షంలో సభ్యురాలిని అని, అయినా టీపీసీసీ ఎంపిక విషయంలో తన అభిప్రాయం తీసుకోలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేగాకుండా ఆ మీటింగ్‌లో తనను వేరు చేసి చూసి, అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. టీపీసీసీ ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం సాధ్యం కాదని సీతక్క స్పష్టం చేశారు. కార్యకర్తలకు నమ్మకం కలిగించే […]

Update: 2020-12-26 09:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ నేతలపై ములుగు ఎమ్మెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆమె ఓ మీడియాతో ఛానల్‌తో మాట్లాడుతూ.. తాను శాసనసభా పక్షంలో సభ్యురాలిని అని, అయినా టీపీసీసీ ఎంపిక విషయంలో తన అభిప్రాయం తీసుకోలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేగాకుండా ఆ మీటింగ్‌లో తనను వేరు చేసి చూసి, అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. టీపీసీసీ ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం సాధ్యం కాదని సీతక్క స్పష్టం చేశారు. కార్యకర్తలకు నమ్మకం కలిగించే వారినే పీసీసీ చీఫ్ చేయాలని ఆమె అన్నారు. తాను కోరుకున్న వారికి టీపీసీసీ పదవి రాకున్నా పార్టీలో ఉంటానని అన్నారు. పీసీసీ విషయంలో హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యమని ఎమ్మెల్యే సీతక్క వెల్లడించారు.

Tags:    

Similar News