Mulugu MLA Seethakka: ఎడ్లబండి ఎక్కి కేసీఆర్‌ బయటకు రావాలన్న సీతక్క..

దిశ, ములుగు : కరోనా సమయంలో ఫామ్‌హౌస్ ముఖ్యమంత్రి ఇప్పటికైనా బయటికి వచ్చి కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని అడవి రంగాపుర్ (నారాయణ పూర్)లలో ఎమ్మెల్యే సీతక్క అక్కడకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఎడ్లబండిపై వెళ్లి నిత్యావసరాలు అందజేశారు. శనివారం ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో బండ్లపాడు, గొత్తి కోయ గూడెంలో కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా.. సీతక్క మాట్లాడుతూ.. […]

Update: 2021-05-29 07:28 GMT

దిశ, ములుగు : కరోనా సమయంలో ఫామ్‌హౌస్ ముఖ్యమంత్రి ఇప్పటికైనా బయటికి వచ్చి కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని అడవి రంగాపుర్ (నారాయణ పూర్)లలో ఎమ్మెల్యే సీతక్క అక్కడకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఎడ్లబండిపై వెళ్లి నిత్యావసరాలు అందజేశారు. శనివారం ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో బండ్లపాడు, గొత్తి కోయ గూడెంలో కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా.. సీతక్క మాట్లాడుతూ.. కరోనా కష్ట కాలములో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం పేద ప్రజలను ఆదుకోకపోవడం దారుణమన్నారు.

ఊరుకు దూరంగా అడవినే నమ్ముకొని బతుకుతున్న గొత్తి కోయ గూడెంలోని ప్రజలకు, ప్రతిపేద వాడి కుటుంబానికి 6 వేల రూపాయలు అందించి ప్రభుత్వం ఆదుకోవాలి. ఫౌమ్‌హౌస్ ముఖ్యమంత్రి ప్రజల మధ్యకు రావాలని బాధితులను, రోగులను అదుకునే ప్రయత్నం చేయాలని సీతక్క అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, టీపీసీసీ కార్యదర్శి పైడకులా అశోక్, మండల అధ్యక్షులు చెన్నో జు సూర్యనారాయణ, ఎండీ చాంద్ పాషా, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్ పాల్గొన్నారు.

Tags:    

Similar News