వైసీపీలో జగడం.. రోజా వర్సెస్ డిప్యూటీ సీఎం

దిశ, ఏపీ బ్యూరో: ఏడాది పాలనను పురస్కరించుకుని వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేథోమధనం ద్వారా రాష్ట్ర ప్రజలను ఆకట్టుకుంటున్న తరుణంలో వైఎస్సార్సీపీలో బయటపడ్డ విభేదాలు చర్చనీయాంశంగా మారాయి. ప్రముఖ సినీ నటి, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా, డిప్యూటీ సీఎం నారాయణస్వామి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. దళితుల కల్యాణమండపం స్థలం సేకరణ నిమిత్తం పుత్తూరులో నారాయణ స్వామి.. జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ్ గుప్తా, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంతో […]

Update: 2020-05-26 07:12 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఏడాది పాలనను పురస్కరించుకుని వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేథోమధనం ద్వారా రాష్ట్ర ప్రజలను ఆకట్టుకుంటున్న తరుణంలో వైఎస్సార్సీపీలో బయటపడ్డ విభేదాలు చర్చనీయాంశంగా మారాయి. ప్రముఖ సినీ నటి, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా, డిప్యూటీ సీఎం నారాయణస్వామి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. దళితుల కల్యాణమండపం స్థలం సేకరణ నిమిత్తం పుత్తూరులో నారాయణ స్వామి.. జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ్ గుప్తా, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంతో పర్యటించడాన్ని రోజా అవమానంగా భావించారు. నియోజకవర్గంలోనే ఉన్న తనకు సమాచారం ఇవ్వకుండానే తన నియోజకర్గంలో డిప్యూటీ సీఎం పర్యటించడంపై ఆమె మండిపడ్డారు. ప్రోటోకాల్ ఉల్లంఘించారని ఆరోపించారు. తనను పట్టించుకోకుండా కార్యక్రమం నిర్వహించడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News