సీపీ సజ్జనార్ వ్యాఖ్యలపై రాజాసింగ్ ఎమన్నారంటే…

దిశ,వెబ్ డెస్క్: సీపీ సజ్జనార్ వ్యాఖ్యలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. మీ పరిధిలోని పీఎస్‌ల ముందు నుంచి ఎన్ని గోవులు తరలిస్తున్నారో తెలుసుకోవాలని సీపీకి సూచించారు. తాను చెప్పేది తప్పైతే తనపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. తన వ్యాఖ్యలు నిజమైతే పోలీసులపై చర్యలు తీసుకుంటారా అని పేర్కొన్నారు. అక్రమంగా తరలిస్తున్న గోవులను పట్టుకుని పీఎస్‌లకు తీసుకు వస్తే పోలీసులు అసభ్యకరంగా తిడుతున్నారని వాపోయారు. పోలీసులు, డీజీపీపై వ్యాఖ్యలు చేయడం అందరికీ ఫ్యాషన్ అయిపోయిందనీ, పోలీసులపై బీజేపీ […]

Update: 2020-12-22 07:43 GMT

దిశ,వెబ్ డెస్క్: సీపీ సజ్జనార్ వ్యాఖ్యలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. మీ పరిధిలోని పీఎస్‌ల ముందు నుంచి ఎన్ని గోవులు తరలిస్తున్నారో తెలుసుకోవాలని సీపీకి సూచించారు. తాను చెప్పేది తప్పైతే తనపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. తన వ్యాఖ్యలు నిజమైతే పోలీసులపై చర్యలు తీసుకుంటారా అని పేర్కొన్నారు.

అక్రమంగా తరలిస్తున్న గోవులను పట్టుకుని పీఎస్‌లకు తీసుకు వస్తే పోలీసులు అసభ్యకరంగా తిడుతున్నారని వాపోయారు. పోలీసులు, డీజీపీపై వ్యాఖ్యలు చేయడం అందరికీ ఫ్యాషన్ అయిపోయిందనీ, పోలీసులపై బీజేపీ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని సీపీ సజ్జనార్ మండిపడ్డారు. ఇటీవల ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై లీగల్‌గా యాక్షన్ తీసుకుంటామని సీపీ సజ్జనార్ మాట్లాడిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News