అధికారుల అలసత్వం.. ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్

దిశ, దుబ్బాక: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించడానికి కృషి చేస్తోన్న ఉపాధ్యాయులకు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అభినందనలు తెలిపారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం కొండాపూర్ గ్రామాన్ని సర్పంచ్ కవితతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యలను వీధుల్లో పర్యటిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సమస్య గురించి డీఈ విక్రమ్ గౌడ్‌తో ఫోన్‌లో మాట్లాడి నివారణకు తక్షణమే పనులు చేపట్టాలని సూచించారు. డబుల్ బెడ్ […]

Update: 2021-04-09 05:22 GMT

దిశ, దుబ్బాక: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించడానికి కృషి చేస్తోన్న ఉపాధ్యాయులకు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అభినందనలు తెలిపారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం కొండాపూర్ గ్రామాన్ని సర్పంచ్ కవితతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యలను వీధుల్లో పర్యటిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సమస్య గురించి డీఈ విక్రమ్ గౌడ్‌తో ఫోన్‌లో మాట్లాడి నివారణకు తక్షణమే పనులు చేపట్టాలని సూచించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఆసరా పించన్ ఆలసత్వంపై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామానికి చెందిన మౌనికకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన రూ.లక్ష 116 చెక్కును అందజేశారు. ఇటీవల విద్యుదాఘాతంతో గాయాలపాలైన వినోద్‌తో పాటు విజయ పాల డైరీ నిర్వాహకుడు గుండం చంద్రారెడ్డిని పరామర్శించారు.

Tags:    

Similar News