ప్రజావసరాలకు అనుగుణంగా అభివృద్ది పనులు

దిశ, పటాన్‌చెరు: జీహెచ్ఎంసీ పరిధిలోని మూడు డివిజన్లలో గల ప్రతి కాలనీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్తున్నట్టు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్‌చెరు పట్టణంలోని వివిధ కాలనీలలో రెండు కోట్ల ఏడు లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, పార్కు ప్రహరీ గోడ నిర్మాణ పనులకు ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నట్టు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి […]

Update: 2020-09-25 10:21 GMT

దిశ, పటాన్‌చెరు:
జీహెచ్ఎంసీ పరిధిలోని మూడు డివిజన్లలో గల ప్రతి కాలనీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్తున్నట్టు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్‌చెరు పట్టణంలోని వివిధ కాలనీలలో రెండు కోట్ల ఏడు లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, పార్కు ప్రహరీ గోడ నిర్మాణ పనులకు ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నట్టు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజలందరి సలహాలు సూచనలతో నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలుపుతున్నట్లు పేర్కొన్నారు.

Tags:    

Similar News