మగకుక్క అంగాన్ని కత్తిరించిన దుండగుడు.. ముఖ్యమంత్రికి లేఖ

దిశ, వెబ్ డెస్క్: దేశం నలుమూలల నుండి అనేక హృదయ విదారకమైన ఘటనలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ముంబైలోని అంధేరీ(పశ్చిమ)లోని కపస్వాడిలో కూడా జంతువును హింసించిన సంఘటన తెరపైకి వచ్చింది. ఈ నెల 25న గుర్తు తెలియని దుండగుడు కుక్క పురుషాంగాన్ని కత్తిరించాడు. రక్తంతో పడి ఉన్న కుక్కను పరేల్‌లోని బాంబేలోని జంతు ఆసుపత్రికి తరలించారు. కుక్క ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు అత్యవసర ఆపరేషన్‌ చేశారు. ఈ ఘటనపై జంతు ప్రేమికులు.. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు, […]

Update: 2021-12-29 01:48 GMT

దిశ, వెబ్ డెస్క్: దేశం నలుమూలల నుండి అనేక హృదయ విదారకమైన ఘటనలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ముంబైలోని అంధేరీ(పశ్చిమ)లోని కపస్వాడిలో కూడా జంతువును హింసించిన సంఘటన తెరపైకి వచ్చింది. ఈ నెల 25న గుర్తు తెలియని దుండగుడు కుక్క పురుషాంగాన్ని కత్తిరించాడు. రక్తంతో పడి ఉన్న కుక్కను పరేల్‌లోని బాంబేలోని జంతు ఆసుపత్రికి తరలించారు. కుక్క ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు అత్యవసర ఆపరేషన్‌ చేశారు. ఈ ఘటనపై జంతు ప్రేమికులు.. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు, అధికారులకు లేఖ రాసినట్లు సమాచారం. ముంబైలోని కుక్కలపై ఇలాంటి అమానవీయమైన ఘటనలు జరగడం ఇది తొలిసారి కాదని, ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయని, ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే.. జంతు ప్రేమికులు ఈ ఘటనపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారని సమాచారం.

Tags:    

Similar News