ఎలక్ట్రానిక్స్ రంగంలో అనేక అవకాశాలు!

దిశ, వెబ్‌డెస్క్: ఎలక్ట్రానిక్స్ తయారీని మరికొంత ప్రోత్సహించేందుకు పెట్టుబడుల అనుకూలమైన విధానాలతో తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాష్ట్రాలకు సూచించారు. ఇండియాలో ఎలక్ట్రానిక్స్ రంగంలో అనేక అవకాశాలున్నాయని, వాటిని వీలైనంత వేగంగా అందుకోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయన తెలిపారు. కొవిడ్-19 నేపథ్యంలో రాష్ట్రాల ఐటీ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఐటీ రంగంలో ఏప్రిల్ 30తో వర్క్ ఫ్రమ్ హోమ్ నిబంధనలు ముగియనున్న నేపథ్యంలో జూలై 31 […]

Update: 2020-04-29 08:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎలక్ట్రానిక్స్ తయారీని మరికొంత ప్రోత్సహించేందుకు పెట్టుబడుల అనుకూలమైన విధానాలతో తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాష్ట్రాలకు సూచించారు. ఇండియాలో ఎలక్ట్రానిక్స్ రంగంలో అనేక అవకాశాలున్నాయని, వాటిని వీలైనంత వేగంగా అందుకోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయన తెలిపారు. కొవిడ్-19 నేపథ్యంలో రాష్ట్రాల ఐటీ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఐటీ రంగంలో ఏప్రిల్ 30తో వర్క్ ఫ్రమ్ హోమ్ నిబంధనలు ముగియనున్న నేపథ్యంలో జూలై 31 వరకూ పొడిగిస్తున్నట్లు తర్వాత మీడియాకు చెప్పారు. ఆరోగ్య సేతు యాప్‌ను రాష్ట్రాలు ప్రశంసించాయని, స్మార్ట్‌ఫోన్‌కు మాత్రమే కాకుండా ఫీచర్ ఫోన్‌లలోనూ దీన్ని ఉపయోగించేలా రూపొందిస్తున్నామని.. త్వరలో విడుదల చేస్తామని మంత్రి వివరించారు. కొవిడ్-19ను నిలువరించేందుకు అనుసరించడానికి అవసరమైన ఉత్తమైన విధానలకు సంబంధించి కేంద్రం, రాష్ట్రాలు షేర్ చేసుకునేందుకు రానున్న మూడు నాలుగు రోజుల్లో ఓ యాప్‌ను ఆవిష్కరించనున్నట్టు మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.

Tags: Ravi Shankar Prasad, COVID-19, electronics, manufacturing in electronics

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News