సీఎంకు మంత్రి పువ్వాడ కృతజ్ఞతలు..

దిశ ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణ ప్రభుత్వం టీఎస్ ఆర్టీసీకి రూ.3వేల కోట్ల నిధులను కేటాయించడంతో సీఎం కేసీఆర్ను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిధులు కేటాయించడం శుభపరిణామమని మంత్రి హర్షం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి పెద్దమనసు చాటుకున్నారని ఉద్యోగులు, అధికారులు, వారి కుటుంబాల తరఫున ధన్యవాదాలు చెప్పారు. రూ.1500 కోట్ల నిధులను బడ్జెట్ లో కేటాయించడంతో పాటు మరో రూ.1500 కోట్లు బడ్జెట్ యేతర నిధులు సంస్థకు […]

Update: 2021-03-18 07:33 GMT

దిశ ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణ ప్రభుత్వం టీఎస్ ఆర్టీసీకి రూ.3వేల కోట్ల నిధులను కేటాయించడంతో సీఎం కేసీఆర్ను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిధులు కేటాయించడం శుభపరిణామమని మంత్రి హర్షం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి పెద్దమనసు చాటుకున్నారని ఉద్యోగులు, అధికారులు, వారి కుటుంబాల తరఫున ధన్యవాదాలు చెప్పారు.

రూ.1500 కోట్ల నిధులను బడ్జెట్ లో కేటాయించడంతో పాటు మరో రూ.1500 కోట్లు బడ్జెట్ యేతర నిధులు సంస్థకు ఆసరాగా నిలువనున్నాయని పేర్కొన్నారు. గతేడాది విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ సంస్థ ఉద్యోగులు, వారి కుటుంబాలు బాగుండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నెలనెలా ఆర్థికపరంగా సహాయ, సహకారాలు అందిస్తూ వస్తుందన్నారు. కరోనా పరిస్థితులను తట్టుకుని ఇప్పుడిప్పుడే గట్టెక్కుతున్న సంస్థ ప్రయాణికుల ఆదరణను చూరగొని మరింత మెరుగైన సేవలు అందిస్తోందని చెప్పారు.

 

 

Tags:    

Similar News