‘గంగిరెద్దుల్లా వచ్చేవారిని గుర్తించండి’

దిశ, వెబ్‌‌డెస్క్: తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులను ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం మాయ మాటలు చెబుతోందని మంత్రి హరీశ్ రావు అన్నారు. జీఎస్టీ, ఐజీఎస్టీ, 14 వ ఆర్థిక సంఘం నిధుల కింద తెలంగాణకు రూ. 10 వేల కోట్లు రావాల్సి ఉందని చెప్పుకొచ్చారు. ఇక కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుల పై స్పందించిన హరీశ్ రావు.. సంక్షేమ పథకాలు తేవాల్సింది పోయి.. రైతుల పై బాంబులు వేస్తున్నారని మండిపడ్డారు. కరోనా సమయంలో కూడా ప్రజల కోసం […]

Update: 2020-09-24 05:46 GMT

దిశ, వెబ్‌‌డెస్క్: తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులను ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం మాయ మాటలు చెబుతోందని మంత్రి హరీశ్ రావు అన్నారు. జీఎస్టీ, ఐజీఎస్టీ, 14 వ ఆర్థిక సంఘం నిధుల కింద తెలంగాణకు రూ. 10 వేల కోట్లు రావాల్సి ఉందని చెప్పుకొచ్చారు. ఇక కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుల పై స్పందించిన హరీశ్ రావు.. సంక్షేమ పథకాలు తేవాల్సింది పోయి.. రైతుల పై బాంబులు వేస్తున్నారని మండిపడ్డారు. కరోనా సమయంలో కూడా ప్రజల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టామని.. సంక్రాంతికి గంగిరెద్దుల్లా.. ఓట్ల కోసం వచ్చే నాయకులను ప్రజలు గుర్తించాలని ఆయన సూచించారు.

Tags:    

Similar News