MSR విలువలతో కూడిన రాజకీయం చేశారు : ఈటల

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ కీలక నేత, మాజీ మంత్రి మెన్నేని సత్యనారాయణ రావు కరోనా బారినపడి మృతిచెందిన విషయం తెలిసిందే. మంగళవారం ఆయన భౌతికాయానికి నివాళులు అర్పించిన మంత్రి ఈటల రాజేందర్, కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. అనంతరం ఎమ్‌ఎస్‌ఆర్ కుటుంబాన్ని పరామర్శించి, ధౌర్యం చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… 60 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఎమ్ఎస్ఆర్, రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని అన్నారు. కరీంనగర్ ప్రజల హృదయాల్లో స్థిరమైన స్థానాన్ని […]

Update: 2021-04-27 02:12 GMT

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ కీలక నేత, మాజీ మంత్రి మెన్నేని సత్యనారాయణ రావు కరోనా బారినపడి మృతిచెందిన విషయం తెలిసిందే. మంగళవారం ఆయన భౌతికాయానికి నివాళులు అర్పించిన మంత్రి ఈటల రాజేందర్, కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. అనంతరం ఎమ్‌ఎస్‌ఆర్ కుటుంబాన్ని పరామర్శించి, ధౌర్యం చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… 60 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఎమ్ఎస్ఆర్, రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని అన్నారు. కరీంనగర్ ప్రజల హృదయాల్లో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకొని, పరమపదించడం చాలా బాధాకరమన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఒక మంచి నీతివంతమైన రాజకీయ నాయకున్ని, గొప్ప అనుభవం ఉన్న నాయకున్ని కోల్పోయిందని అభిప్రాయపడ్డారు. 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొనడమే కాకుండా ఎన్నికలలో పోటీ చేసి నెగ్గారని చెప్పారు. మొదటి నుంచి విలువలతో కూడిన రాజకీయాలు ఉండాలని, రాజకీయాల్ని ప్రజాపరం చేయాలని తపనపడిన వారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీలో కీలకమైన స్థానంలో ఉండి కూడా జిల్లా ప్రజలను మరవనటువంటి వ్యక్తి సత్యనారాయణని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News