నేను బాగున్నా.. నాకే సమస్య లేదు

దిశ ప్రతినిధి, వరంగల్: ప్రజల ఆశీస్సులతో నేను బాగున్నాను. నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. దయచేసి ఎవరూ అబద్ధపు ప్రచారాలు చేయొద్దు. అలాంటి ప్రచారాలను ప్రజలెవరూ నమ్మొద్దు. నాకు ఇబ్బందులు వస్తే.. నా కుటుంబ సభ్యులు, ఆత్మబంధువులు, ప్రజలతోనే పంచుకుంటాను’ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ… తనకు కరోనా వచ్చిందంటూ కొందరు వ్యక్తులు, కొన్ని మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న వదంతులను మంత్రి ఖండించారు. […]

Update: 2020-07-26 05:58 GMT

దిశ ప్రతినిధి, వరంగల్: ప్రజల ఆశీస్సులతో నేను బాగున్నాను. నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. దయచేసి ఎవరూ అబద్ధపు ప్రచారాలు చేయొద్దు. అలాంటి ప్రచారాలను ప్రజలెవరూ నమ్మొద్దు. నాకు ఇబ్బందులు వస్తే.. నా కుటుంబ సభ్యులు, ఆత్మబంధువులు, ప్రజలతోనే పంచుకుంటాను’ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ… తనకు కరోనా వచ్చిందంటూ కొందరు వ్యక్తులు, కొన్ని మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న వదంతులను మంత్రి ఖండించారు. అవన్నీ అవాస్తవాలని కొట్టి పారేశారు.
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో మన దేశం, రాష్ట్రంలోనూ ఒకరిద్దరితో మొదలై వేలు లక్షలకు చేరుకుందని మంత్రి తెలిపారు.
కరోనా సామాజిక వ్యాప్తి జరుగుతున్న తరుణంలో ఎవరూ దానికి అతీతులం కాదన్నారు. అందుకే తాను ప్రజల కోసం, ప్రజల్లో ధైర్యాన్ని నింపడానికి, ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసానివ్వడానికి విశేషంగా, విస్తృతంగా ప్రజల్లోనే తిరుగుతున్నామన్నారు. తనతోపాటు తన సిబ్బంది కూడా అహర్నిశలు పని చేస్తున్నారని చెప్పారు.

Tags:    

Similar News