‘‘గుంట నక్కల్లా కాచుకుని ఉన్నారు’’

దిశ,వెబ్ డెస్క్: టీడీపీ నేత అచ్చెన్నాయుడి తీరుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ హయాంలో బలహీన వర్గాలకు ఏం చేశారో చెప్పాలని అచ్చెన్నాయుడును మంత్రి బొత్స డిమాండ్ చేశారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు బలహీన వర్గాలను మోసం చేశారని బొత్స వ్యాఖ్యానించారు. చట్ట పరంగా బలహీన వర్గాలకు 50శాతం రిజర్వేషన్లు ఇచ్చామని అన్నారు. అధికారం కోసం టీడీపీ నేతలు గుంట నక్కల్లా కాచుకుని ఉన్నారని విమర్శించారు. ఇంటి పన్నులో శాస్త్రీయ విధానం తీసుకు […]

Update: 2020-12-19 07:05 GMT

దిశ,వెబ్ డెస్క్: టీడీపీ నేత అచ్చెన్నాయుడి తీరుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ హయాంలో బలహీన వర్గాలకు ఏం చేశారో చెప్పాలని అచ్చెన్నాయుడును మంత్రి బొత్స డిమాండ్ చేశారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు బలహీన వర్గాలను మోసం చేశారని బొత్స వ్యాఖ్యానించారు. చట్ట పరంగా బలహీన వర్గాలకు 50శాతం రిజర్వేషన్లు ఇచ్చామని అన్నారు. అధికారం కోసం టీడీపీ నేతలు గుంట నక్కల్లా కాచుకుని ఉన్నారని విమర్శించారు. ఇంటి పన్నులో శాస్త్రీయ విధానం తీసుకు వచ్చామని తెలిపారు.

Tags:    

Similar News