రణరంగంగా హైదరాబాద్ ఐఐటీ

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా కంది సమీపంలో ఉన్న ఐఐటీ హైదరాబాద్‌లో పనిచేస్తున్న భవన నిర్మాణ రంగ కార్మికులు రణరంగం సృష్టించారు. జార్ఖండ్‌కు చెందిన వీరు లాక్‌డౌన్ నేపథ్యంలో 40 రోజులుగా ఇక్కడే ఉండి పోయారు. చేసిన పనికి వేతనాలు కాంట్రాక్టర్ ఇవ్వటం లేదని, దీంతో తమ కుటుంబీకులకు డబ్బులు పంపలేక తీవ్ర అవస్థలకు గురిచేస్తున్నారన్నారు. ఈ క్రమంలో వారు ఐఐటీ ప్రాంగణంలో దాడికి దిగారు. విషయం తెలుసుకున్న సంగారెడ్డి రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోని […]

Update: 2020-04-29 01:15 GMT

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా కంది సమీపంలో ఉన్న ఐఐటీ హైదరాబాద్‌లో పనిచేస్తున్న భవన నిర్మాణ రంగ కార్మికులు రణరంగం సృష్టించారు. జార్ఖండ్‌కు చెందిన వీరు లాక్‌డౌన్ నేపథ్యంలో 40 రోజులుగా ఇక్కడే ఉండి పోయారు. చేసిన పనికి వేతనాలు కాంట్రాక్టర్ ఇవ్వటం లేదని, దీంతో తమ కుటుంబీకులకు డబ్బులు పంపలేక తీవ్ర అవస్థలకు గురిచేస్తున్నారన్నారు. ఈ క్రమంలో వారు ఐఐటీ ప్రాంగణంలో దాడికి దిగారు. విషయం తెలుసుకున్న సంగారెడ్డి రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోని వలస కూలీలను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో వలస కూలీలు పోలీసులపై రాళ్ల దాడికి దిగ్గారు. అక్కడే ఉన్న పోలీసు వాహనాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. తమకు రావల్సిన వేతనాలు ఇచ్చి స్వస్థలాలకు పంపించాలని డిమాండ్ చేశారు. ఆందోళన తీవ్రమవ్వడంతో ఘటనా స్థలానికి ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, ఆర్డీవో మెంచు నగేష్‌తో పాటు పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు వలస కూలీలతో చర్చలు జరుపుతున్నారు.

Tags: hyderabad IIT, kandi, migrant workers, protest, medak, ts news

Tags:    

Similar News