ఎంఎస్ఎంఈలకు ఊరట

ముంబయి: నగదు ప్రవాహం లేక, గిరాకీ పడిపోయి సంక్షోభంలోకి జారుకుంటున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ(ఎంఎస్ఎంఈ)లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఊరట కలిగించింది. రుణాల పునర్వ్యవస్థీకరణను వచ్చే ఏడాది మార్చి 31వరకు పొడిగిస్తూ ద్రవ్య ధాన కమిటీ నిర్ణయం తీసుకుందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. అయితే, ఈ వెసులుబాటు ఎలాంటి డిఫాల్ట్ లేని రుణాలను సక్రమంగా చెల్లిస్తున్న ఎంఎస్‌ఎంఈలకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొన్నారు. ‘రుణాల పునర్వ్యస్థీకరణ ప్రక్రియ చాలా ఇబ్బందులతో కూడుకున్నది. కానీ, […]

Update: 2020-08-06 08:54 GMT

ముంబయి: నగదు ప్రవాహం లేక, గిరాకీ పడిపోయి సంక్షోభంలోకి జారుకుంటున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ(ఎంఎస్ఎంఈ)లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఊరట కలిగించింది. రుణాల పునర్వ్యవస్థీకరణను వచ్చే ఏడాది మార్చి 31వరకు పొడిగిస్తూ ద్రవ్య ధాన కమిటీ నిర్ణయం తీసుకుందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. అయితే, ఈ వెసులుబాటు ఎలాంటి డిఫాల్ట్ లేని రుణాలను సక్రమంగా చెల్లిస్తున్న ఎంఎస్‌ఎంఈలకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొన్నారు.

‘రుణాల పునర్వ్యస్థీకరణ ప్రక్రియ చాలా ఇబ్బందులతో కూడుకున్నది. కానీ, జనవరి నుంచే ఆరోగ్యకరమైన ఎంఎస్‌ఎంఈలు ఈ సౌకర్యం పొందుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుండటంతో ఆర్థిక కార్యకలాపాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నగదు ప్రవాహం లేక ఒత్తిడిలో ఉన్న ఎంఎస్‌ఎంఈల రంగాలకు మరింత మద్దతు అవసరం. ఒత్తిడితో కూడిన ఎంఎస్ఎంఈ రుణగ్రహీతలు తమ రుణాన్ని ప్రస్తుత ఫ్రేమ్ వర్క్ కింద పునర్నిర్మించటానికి అర్హులుగా నిర్ణయించాం’ అని శక్తికాంత దాస్ పేర్కొన్నారు.

Tags:    

Similar News