షాకింగ్.. మహిళా టిక్ టాకర్‌ను వివస్త్రను చేసి.. సంచలన వీడియో

దిశ, వెబ్‌డెస్క్ : స్వాతంత్య్ర దినోత్సవం రోజున పాకిస్థాన్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ టిక్ టాకర్‌ను వివస్త్రను చేసి.. దుస్తులను గాల్లోకి ఎగురేస్తూ వీధుల్లో ఊరేగించారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. ఆగస్టు 14వ తేదీన లాహోర్‌లోని మినార్-ఈ-పాకిస్థాన్​ వద్ద ఓ మహిళా టిక్​టాకర్ తన గ్రూప్ సభ్యులతో కలిసి వీడియో షూట్ చేస్తున్నారు. అదే సమయంలో వందలాది […]

Update: 2021-08-18 06:48 GMT

దిశ, వెబ్‌డెస్క్ : స్వాతంత్య్ర దినోత్సవం రోజున పాకిస్థాన్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ టిక్ టాకర్‌ను వివస్త్రను చేసి.. దుస్తులను గాల్లోకి ఎగురేస్తూ వీధుల్లో ఊరేగించారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. ఆగస్టు 14వ తేదీన లాహోర్‌లోని మినార్-ఈ-పాకిస్థాన్​ వద్ద ఓ మహిళా టిక్​టాకర్ తన గ్రూప్ సభ్యులతో కలిసి వీడియో షూట్ చేస్తున్నారు. అదే సమయంలో వందలాది మంది గుర్తుతెలియని వ్యక్తులు.. ఆ మహిళా టిక్ టాకర్‌పై దాడికి పాల్పడ్డారు.

మహిళను వివస్త్రను చేసి.. ఆమె దుస్తులను గాల్లోకి ఎగరేసి పైశాచిక ఆనందాన్ని పొందారు. ఈ ఘటన అనంతరం సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. తనతోపాటు.. గ్రూప్ సభ్యులనూ వేధించారని మహిళ.. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తన ఒంటిపై ఉన్న బంగారం, సెల్ ఫోన్, రూ. 15వేలు నగదును లాగేసుకున్నారని తెలిపింది.

అయితే మహిళపై దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై లాహోర్ డీఐజీ సాజిద్​ ఖియానీ స్పందించారు. ఈ దాడికి పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ దాడి ఘటనపై పాక్ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News