షెఫాలీ భయం.. ఆడకుంటేనే నయం

ఐసీసీ మహిళా టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్‌లో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియాతో ఆడటం నాకు నచ్చదంటూ ఆసీస్ బౌలర్ మెగన్ స్కట్‌ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికంగా మారాయి. అయితే దీని వెనుక జాతి వివక్షో లేదా ఇండియా అంటే కక్షో లేదు. అది కేవలం భయం మాత్రమే. ‘నాకు షెఫాలీ, స్మృతి మంధానకు బౌలింగ్ చేయాలని లేదు. వాళ్లు నా బౌలింగ్‌ను ఉతికి ఆరేస్తారని చెప్పింది. ఈ మెగా ఈవెంట్ […]

Update: 2020-03-06 06:00 GMT

ఐసీసీ మహిళా టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్‌లో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియాతో ఆడటం నాకు నచ్చదంటూ ఆసీస్ బౌలర్ మెగన్ స్కట్‌ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికంగా మారాయి. అయితే దీని వెనుక జాతి వివక్షో లేదా ఇండియా అంటే కక్షో లేదు. అది కేవలం భయం మాత్రమే. ‘నాకు షెఫాలీ, స్మృతి మంధానకు బౌలింగ్ చేయాలని లేదు. వాళ్లు నా బౌలింగ్‌ను ఉతికి ఆరేస్తారని చెప్పింది. ఈ మెగా ఈవెంట్ తొలి మ్యాచ్‌లోనే షెఫాలీ నా బౌలింగ్‌ను చీల్చి చెండాడింది. ముఖ్యంగా పవర్ ప్లేలో షెఫాలీ, స్మృతి నన్ను ఒక ఆట ఆడుకుంటారని అన్నది. అందుకే వారికి బౌలింగ్ చేయడమంటే నాకు భయమని..తన వ్యాఖ్యలకు అసలైన అర్థాన్ని చెప్పింది. మరి ఈ ఫైనల్‌లో మెగన్ స్కట్ బౌలింగ్‌ను భారత బ్యాట్స్‌వుమెన్ ఎలా ఎదుర్కొంటారా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

tags : ICC, T20, Final, Aus Vs India, Shafali, Mandhana, Megan Schutt

Tags:    

Similar News