వేతనాల పెంపుకోసం కార్మికుల వినూత్న నిరసన

దిశ, నాగర్ కర్నూల్: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులు చెవిలో పువ్వులు పెట్టుకొని జిల్లా ఆస్పత్రి ఎదుట శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము భరత్, పాల్గొని మాట్లాడుతూ… ప్రభుత్వ ఆస్పత్రిలో దాదాపు 20 ఏళ్ల నుంచి అతి తక్కువ వేతనాలతో వెట్టిచాకిరి చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలోని పారిశుధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది, పేషెంట్ కేర్ సిబ్బందిలో […]

Update: 2021-06-25 05:18 GMT

దిశ, నాగర్ కర్నూల్: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులు చెవిలో పువ్వులు పెట్టుకొని జిల్లా ఆస్పత్రి ఎదుట శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము భరత్, పాల్గొని మాట్లాడుతూ… ప్రభుత్వ ఆస్పత్రిలో దాదాపు 20 ఏళ్ల నుంచి అతి తక్కువ వేతనాలతో వెట్టిచాకిరి చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలోని పారిశుధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది, పేషెంట్ కేర్ సిబ్బందిలో దాదాపు 90 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అట్టడుగు వర్గాలకు చెందిన పేదలే పనిచేస్తున్నారని అన్నారు.

అలాంటి వారి పట్ల ప్రభుత్వం వివక్ష చూపడం సమంజసం కాదన్నారు. అన్ని విభాగాల్లోని కార్మికులు దాదాపు 9 ఏండ్ల నుంచి పనిచేస్తున్నా వేతనాల పెంపునకు మాత్రం నోచుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆసుపత్రి బ్రాంచ్ నాయకులు కె.అంజనేయులు, నిరంజన్, బాలమణి, వెంకటమ్మ, అజ్మీరా, బురాన్ బీ, సంతోషమ్మ, మహేశ్వరి, నాగమణి, గౌరమ్మ, రాధమ్మ, లక్ష్మణ్, జగన్, సాయినాథ్, రంజాన్ బి, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News