ఆగని ‘ఆన్‌లైన్’ కాల్స్.. ఎంబీఏ విద్యార్థిని సూసైడ్‌..!

దిశ, విశాఖపట్నం: గాజువాక సుందరయ్య కాలనీలో ఎంబీఏ విద్యార్థిని సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆటోనగర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసే సత్యనారాయణ కూతురు అహల్య.. కొన్ని నెలల క్రితం ఆన్‌లైన్‌లో అప్పులు తీసుకుంది. అయితే వాటిని తిరిగి చెల్లించకపోవడంతో ఫోన్‌కాల్స్‌ ఎక్కువై పోయాయి. ఇదే క్రమంలో తీవ్ర ఒత్తిడికి గురైన విద్యార్థిని అహల్య.. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని సూసైడ్ చేసుకుంది. కూతురు మృతదేహాన్ని […]

Update: 2020-11-03 07:39 GMT

దిశ, విశాఖపట్నం: గాజువాక సుందరయ్య కాలనీలో ఎంబీఏ విద్యార్థిని సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆటోనగర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసే సత్యనారాయణ కూతురు అహల్య.. కొన్ని నెలల క్రితం ఆన్‌లైన్‌లో అప్పులు తీసుకుంది. అయితే వాటిని తిరిగి చెల్లించకపోవడంతో ఫోన్‌కాల్స్‌ ఎక్కువై పోయాయి. ఇదే క్రమంలో తీవ్ర ఒత్తిడికి గురైన విద్యార్థిని అహల్య.. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని సూసైడ్ చేసుకుంది. కూతురు మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మూడ్రోజుల వ్యవధిలో ఇదేప్రాంతంలో ఇద్దరు విద్యార్థులు చనిపోవడం విశేషం.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News