తొందరపడ్డ మయాంక్ ఔట్

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 22వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రైజింగ్ మీద ఉంది. 201 భారీ టార్గెట్‌ను నిర్ధేశించిన వార్నర్ సేన ఫీల్డింగ్‌ అదరగొట్టింది. రెండో ఓవర్‌లోనే యంగ్ బ్యాట్స్‌మెన్‌ మయాంక్ అగర్వాల్‌ను(9) రన్‌ఔట్ చేసి పెవిలియన్ పంపింది. కలీల్ అహ్మద్ వేసిన బంతిని కొట్టిన మయాంక్ రెండు పరుగులకు యత్నించాడు. చాకచక్యంగా బంతిని పట్టిన వార్నర్ బాల్‌ను వికెట్ల వద్ద కాపుగాస్తున్న బౌలర్‌కు అందజేశాడు. ఇది గమనించిన రాహుల్‌ వద్దని సైగ చేసినప్పటికీ అప్పటికే […]

Update: 2020-10-08 11:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 22వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రైజింగ్ మీద ఉంది. 201 భారీ టార్గెట్‌ను నిర్ధేశించిన వార్నర్ సేన ఫీల్డింగ్‌ అదరగొట్టింది. రెండో ఓవర్‌లోనే యంగ్ బ్యాట్స్‌మెన్‌ మయాంక్ అగర్వాల్‌ను(9) రన్‌ఔట్ చేసి పెవిలియన్ పంపింది. కలీల్ అహ్మద్ వేసిన బంతిని కొట్టిన మయాంక్ రెండు పరుగులకు యత్నించాడు. చాకచక్యంగా బంతిని పట్టిన వార్నర్ బాల్‌ను వికెట్ల వద్ద కాపుగాస్తున్న బౌలర్‌కు అందజేశాడు. ఇది గమనించిన రాహుల్‌ వద్దని సైగ చేసినప్పటికీ అప్పటికే హాఫ్ క్రీజ్ దాటిన మయాంక్ వెనక్కి వచ్చే క్రమంలో రన్ ఔట్ అయ్యాడు. దీంతో హైదరాబాద్‌ కీలక వికెట్‌ను పడగొట్టింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్, సిమ్రన్ సింగ్ ఉన్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News