మహబూబ్‌నగర్‌లో విషాదం

      మహబూబ్‌నగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నవాబుపేట మండలం కొల్లూరు‌కు చెందిన తల్లి, కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు  ఇలా.. గ్రామానికి చెందిన చిట్టెమ్మ భర్త నరసింహులు రెండేళ్ల క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి గ్రామాంలోనే చిన్న కిరాణాం షాపు పెట్టుకొని కుటుంబాన్ని పోషిస్తోంది. తనకున్న ఇద్దరు పిల్లలో పెద్ద కుమారుడు సిద్దార్థ డిగ్రీ, చిన్న కుమారుడు శ్రీరాం ఇంటర్ చదువుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం చిట్టెమ్మ తన చిన్న కుమారుడిని బాగా […]

Update: 2020-02-03 00:31 GMT

హబూబ్‌నగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నవాబుపేట మండలం కొల్లూరు‌కు చెందిన తల్లి, కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన చిట్టెమ్మ భర్త నరసింహులు రెండేళ్ల క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి గ్రామాంలోనే చిన్న కిరాణాం షాపు పెట్టుకొని కుటుంబాన్ని పోషిస్తోంది. తనకున్న ఇద్దరు పిల్లలో పెద్ద కుమారుడు సిద్దార్థ డిగ్రీ, చిన్న కుమారుడు శ్రీరాం ఇంటర్ చదువుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం చిట్టెమ్మ తన చిన్న కుమారుడిని బాగా చదువుకోవాలని మందలించింది. తల్లి కొడుకు మధ్య మాటామాట పెరిగి గొడవ పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన తల్లి, కొడుకు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది గమనించిన పెద్ద కుమారుడు సిద్ధార్థ వారిని మహబూబ్‌నగర్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Tags:    

Similar News