రెడ్‌క్రాస్ ఆధ్వ‌ర్యంలో మాస్కుల పంపిణీ

దిశ‌, ఖమ్మం : క‌రోనా వైర‌స్ ప్రజలకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తీసుకుంటున్నచ‌ర్య‌ల్లో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు మంగ‌ళ‌వారం జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఖమ్మం చర్చి కాంపౌండ్, గాంధీ పార్క్ సొసైటీ జిల్లా కార్యాలయంలో ప్ర‌జ‌లకు వైరస్‌పై అవగాహ‌న క‌ల్పించేందుకు ప్రత్యేకంగా త‌యారు చేయించిన క‌ర‌ప‌త్రాలను విలేక‌రుల స‌మ‌క్షంలో విడుద‌లు చేశారు. అనంతరం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు 200 మందికి మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా […]

Update: 2020-04-14 08:26 GMT

దిశ‌, ఖమ్మం :
క‌రోనా వైర‌స్ ప్రజలకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తీసుకుంటున్నచ‌ర్య‌ల్లో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు మంగ‌ళ‌వారం జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఖమ్మం చర్చి కాంపౌండ్, గాంధీ పార్క్ సొసైటీ జిల్లా కార్యాలయంలో ప్ర‌జ‌లకు వైరస్‌పై అవగాహ‌న క‌ల్పించేందుకు ప్రత్యేకంగా త‌యారు చేయించిన క‌ర‌ప‌త్రాలను విలేక‌రుల స‌మ‌క్షంలో విడుద‌లు చేశారు. అనంతరం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు 200 మందికి మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో కరోనా వైరస్ నియంత్రణకు అత్యవసర సేవలందిస్తున్న వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది, జర్నలిస్టుల సేవలను అభినందించారు. రాష్ట్ర గవర్నర్, ఐఆర్‌సీ‌ఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందర రాజన్ ఆదేశాల మేరకు ఇప్పటికే రెడ్‌క్రాస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని పలుచోట్ల పోలీసులు, వైద్య ఆరోగ్య, పారిశుధ్య సిబ్బందికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ జ‌ర్న‌లిస్టుల‌కు మాస్కులు పంపిణీ చేసినట్టు వెల్లడించారు. త్వ‌ర‌లోనే మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వ‌హించేందుకు క‌మిటీ సిద్ధంగా ఉంద‌న్నారు. కార్యక్రమంలో సొసైటీ జిల్లా చైర్మన్ కలిశెట్టి విజయ్ కుమార్, వైస్ చైర్మన్ డాక్టర్ వెలిగేటి చంద్రమోహన్, జే‌ఆర్‌సీ, వై‌ఆర్‌సీ జిల్లా కన్వీనర్ షేక్ ముజీబ్, మీడియా కన్వీనర్ మైసా పాపారావు పాల్గొన్నారు.

Tags: corona, lockdown, red cross, masks supply

Tags:    

Similar News