భయాందోళనలో మన్సూరాబాద్ డివిజన్ ప్రజలు

దిశ, మన్సూరాబాద్: మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని భవానీనగర్, మధురానగర్ కలిసే ప్రధాన సర్కిళ్లలో ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ ప్రమాద కరంగా మారాయి. ఈ నేపథ్యంలో నిత్యం కాలనీవాసులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ట్రాన్స్ ఫార్మార్ల చుట్టూ పిచ్చి చెట్లు ఏపుగా పెరిగాయి. స్థానికులు అక్కడనే చెత్తా చెదారం వేస్తున్నారు. చింతలకుంట పెద్ద చెరువు మురుగు నీరంతా సరస్వతినగర్ కాలనీలోకి చేరుతోంది. దీంతో కాలనీ అంతా కూడా కంపు కొడుతోంది. స్థానికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. […]

Update: 2021-10-26 01:49 GMT

దిశ, మన్సూరాబాద్: మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని భవానీనగర్, మధురానగర్ కలిసే ప్రధాన సర్కిళ్లలో ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ ప్రమాద కరంగా మారాయి. ఈ నేపథ్యంలో నిత్యం కాలనీవాసులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ట్రాన్స్ ఫార్మార్ల చుట్టూ పిచ్చి చెట్లు ఏపుగా పెరిగాయి. స్థానికులు అక్కడనే చెత్తా చెదారం వేస్తున్నారు. చింతలకుంట పెద్ద చెరువు మురుగు నీరంతా సరస్వతినగర్ కాలనీలోకి చేరుతోంది. దీంతో కాలనీ అంతా కూడా కంపు కొడుతోంది. స్థానికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలన్నిటిపైనా సంబంధిత అధికారులు దృష్టి సారించి పరిష్కరించాలని కోరుతున్నారు.

Tags:    

Similar News