‘నన్ను సీఎం చేస్తే ఆ హామీలన్నీ నెరవేరుస్తా’

దిశ, పాలేరు: తనను సీఎం చేస్తే కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో ఆదివారం ఆయన పర్యటించారు. పైనంపల్లి నుంచి సుర్దేపల్లి వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సుర్దేపల్లి గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మాజీ ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు విగ్రహాలను ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళిత, బడుగు, బలహీన వర్గాలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలోఎమ్మార్పీఎస్ […]

Update: 2021-02-14 10:01 GMT

దిశ, పాలేరు: తనను సీఎం చేస్తే కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో ఆదివారం ఆయన పర్యటించారు. పైనంపల్లి నుంచి సుర్దేపల్లి వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సుర్దేపల్లి గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మాజీ ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు విగ్రహాలను ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళిత, బడుగు, బలహీన వర్గాలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలోఎమ్మార్పీఎస్ జాతీయ కమిటీ ఉపాధ్యక్షుడు వంగురి ఆనందరావు, విగ్రహ దాతలు రామారావు, నాగేశ్వరరావు, సర్పంచ్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News