వేటకొడవలితో దారుణ హత్య

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పి.మల్లాపురం గ్రామంలో దారుణ ఘటన జరిగింది. మద్యం మత్తులో వరుసకు అన్న అయిన బోయ చెన్నప్ప(38) అనే వ్యక్తిని వేటకొడవలితో తమ్ముడు చంద్రశేఖర్ నరికి చంపాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు దాయాదుల కుమారులైన చెన్నప్ప, చంద్రశేఖర్ బుధవారం రాత్రి మద్యం తెచ్చుకుని తాగారు. అదే సమయంలో వ్యక్తిగత విషయాలపై తగవులాడుకున్నారు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన చంద్రశేఖర్ పక్కనే ఉన్న కొడవలి […]

Update: 2020-10-15 04:59 GMT

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పి.మల్లాపురం గ్రామంలో దారుణ ఘటన జరిగింది. మద్యం మత్తులో వరుసకు అన్న అయిన బోయ చెన్నప్ప(38) అనే వ్యక్తిని వేటకొడవలితో తమ్ముడు చంద్రశేఖర్ నరికి చంపాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు దాయాదుల కుమారులైన చెన్నప్ప, చంద్రశేఖర్ బుధవారం రాత్రి మద్యం తెచ్చుకుని తాగారు. అదే సమయంలో వ్యక్తిగత విషయాలపై తగవులాడుకున్నారు.

ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన చంద్రశేఖర్ పక్కనే ఉన్న కొడవలి తీసుకుని విచక్షణా రహితంగా చెన్నప్ప తలపై నరికాడు. దీంతో చెన్నప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News