వేధించాడు.. కటకటాల పాలయ్యాడు

దిశ, వెబ్ డెస్క్: అతను ఓ కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. అయితే అతనికి మహిళలను వేధించాలనే పాడు బుద్ధి పుట్టింది. దీంతో రోజు ఆఫీసుకు బయలుదేరే గంట ముందు బస్ స్టేషన్, బీచ్ రోడ్డులో బైక్ పై తిరుగుతూ.. అక్కడ ఉండే మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. వారి ముఖాలను దగ్గర నుంచి చూస్తూ పరారయ్యాడు. ఈ ఘటన విశాఖలో చోటుచేసుకుంది. స్థానిక అఫీషియల్ కాలనీకి చెందిన రాంబాబు అనే వ్యక్తి దీన్ని దినచర్యగా భావించి రోజు […]

Update: 2020-08-03 11:37 GMT

దిశ, వెబ్ డెస్క్: అతను ఓ కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. అయితే అతనికి మహిళలను వేధించాలనే పాడు బుద్ధి పుట్టింది. దీంతో రోజు ఆఫీసుకు బయలుదేరే గంట ముందు బస్ స్టేషన్, బీచ్ రోడ్డులో బైక్ పై తిరుగుతూ.. అక్కడ ఉండే మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. వారి ముఖాలను దగ్గర నుంచి చూస్తూ పరారయ్యాడు. ఈ ఘటన విశాఖలో చోటుచేసుకుంది. స్థానిక అఫీషియల్ కాలనీకి చెందిన రాంబాబు అనే వ్యక్తి దీన్ని దినచర్యగా భావించి రోజు మహిళలను వేధిస్తున్నాడు.

గత రెండు రోజుల క్రితం ఇలానే ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే ఆమె అందరిలా కాకుండా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడి కోసం పోలీసులు వేట కొనసాగించారు. ఎట్టకేలకు సోమవారం ఆర్కే బీచ్ రోడ్ లో నిందితుడు రాంబాబును పోలీసులు పట్టుకున్నారు.

Tags:    

Similar News