కరెంట్ ఫ్రీ..కండిషన్స్ అప్లై!

        పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్ర ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. పేద, మధ్యతరగతి ప్రజల కోసం ఉచితంగా కరెంట్‌ ఇవ్వనున్నట్టు ప్రకటించారు.అంతలోనే కండిషన్స్ అప్లై అంటూ మెలిక పెట్టారు. మూడు నెలల్లో 75యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వారికి మాత్రమే ఈ అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. దీనిపై మిశ్రమ స్పందన వస్తున్నట్టు తెలుస్తోంది.కాగా, కేజ్రీవాల్ పథకాన్ని కాపీ కొట్టిందంటూ దీదీపై జోకులు కూడా పేలుతున్నాయి. బెంగాల్‌లో 2021లో జరగనున్న ఎన్నికల […]

Update: 2020-02-11 20:40 GMT

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్ర ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. పేద, మధ్యతరగతి ప్రజల కోసం ఉచితంగా కరెంట్‌ ఇవ్వనున్నట్టు ప్రకటించారు.అంతలోనే కండిషన్స్ అప్లై అంటూ మెలిక పెట్టారు. మూడు నెలల్లో 75యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వారికి మాత్రమే ఈ అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. దీనిపై మిశ్రమ స్పందన వస్తున్నట్టు తెలుస్తోంది.కాగా, కేజ్రీవాల్ పథకాన్ని కాపీ కొట్టిందంటూ దీదీపై జోకులు కూడా పేలుతున్నాయి. బెంగాల్‌లో 2021లో జరగనున్న ఎన్నికల కోసం ఇప్పటి నుంచే మమతా వార్మప్ మొదలెట్టారంటూ పలువురు చమత్కరిస్తున్నారు.

Tags:    

Similar News