షా.. మీరేమైన ఈవీఎంలలోకి దూరారా?

దిశ,వెబ్ డెస్క్ : కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. పశ్చిమ బెంగాల్లో విడతలవారిగా ఎన్నికలు నిర్వహించనున్నారు.  ఈ నేపథ్యంలో తొలి విడుతగా ఈనెల 27న పశ్చిమ బెంగాల్లో 30 స్థానాలకు ఎన్నికలు జరగగా..  వీటిలో 26 స్థానాలు గెలుచుకుంటామని కేంద్రమంత్రి అమిత్ షా జోస్యం చెప్పాడు. దీని పై స్పందించిన మమతా బెనర్జీ 26 స్థానాల్లో మాత్రమే గెలుస్తామని ఎలా చెబుతున్నారని, కొంపదీసి ఆయనేమైనా ఈవీఎంలలోకి […]

Update: 2021-03-28 23:38 GMT

దిశ,వెబ్ డెస్క్ : కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. పశ్చిమ బెంగాల్లో విడతలవారిగా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తొలి విడుతగా ఈనెల 27న పశ్చిమ బెంగాల్లో 30 స్థానాలకు ఎన్నికలు జరగగా.. వీటిలో 26 స్థానాలు గెలుచుకుంటామని కేంద్రమంత్రి అమిత్ షా జోస్యం చెప్పాడు. దీని పై స్పందించిన మమతా బెనర్జీ 26 స్థానాల్లో మాత్రమే గెలుస్తామని ఎలా చెబుతున్నారని, కొంపదీసి ఆయనేమైనా ఈవీఎంలలోకి దూరారా? అని మమత ప్రశ్నించారు. మే 2వ తేదీ వరకు ఆగితే ఎవరు ఎన్ని స్థానాల్లో గెలుస్తారో తెలిసిపోతుందని అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి’’ అని మమత అన్నారు. బెంగాల్‌ను బయటి వ్యక్తులు పాలించబోరని, ఇక్కడ టీఎంసీదే విజయమని మమత ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News