మల్కాపూర్‌లో కనుచూపుమేర నీరే..

దిశ, తాండూర్ : వికారాబాద్ జిల్లాలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి తాండూరు మండలం మల్కాపూర్ గ్రామం నీటిలో మునిగిపోయింది. మల్కాపూర్ మొత్తం రాళ్ల గనులతో కూడుకుని ఉంటుంది. ఈ వర్షానికి చుట్టుపక్కల గనులన్నీ నీటితో నిండిపోవడంతో వరద కాస్త ఊర్లోకి వచ్చింది. దీంతో అక్కడి ఇళ్ళన్నీ నీటిలో మునిగిపోవడంతో పిల్లలు, వృద్ధులు, గ్రామస్తులందరూ ఇళ్ల పైకెక్కి తమ ప్రాణాలను రక్షించుకున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తమ గ్రామానికి శాశ్వత పరిష్కారం చూపించాలని బాధితులు కోరుతున్నారు. మల్కాపూర్‌లో […]

Update: 2020-07-23 01:34 GMT

దిశ, తాండూర్ :
వికారాబాద్ జిల్లాలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి తాండూరు మండలం మల్కాపూర్ గ్రామం నీటిలో మునిగిపోయింది. మల్కాపూర్ మొత్తం రాళ్ల గనులతో కూడుకుని ఉంటుంది. ఈ వర్షానికి చుట్టుపక్కల గనులన్నీ నీటితో నిండిపోవడంతో వరద కాస్త ఊర్లోకి వచ్చింది. దీంతో అక్కడి ఇళ్ళన్నీ నీటిలో మునిగిపోవడంతో పిల్లలు, వృద్ధులు, గ్రామస్తులందరూ ఇళ్ల పైకెక్కి తమ ప్రాణాలను రక్షించుకున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తమ గ్రామానికి శాశ్వత పరిష్కారం చూపించాలని బాధితులు కోరుతున్నారు. మల్కాపూర్‌లో ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది. ఏకంగా మనిషిలోతు వర్షపునీరు ఇళ్లలోకి చేరడంతో వస్తువులు, బట్టలు, ధాన్యం కూడా తడిచిపోయాలని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు జిల్లాలో కరోనా విజృంభిస్తుండగా, వర్షం వలన సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

Tags:    

Similar News