ఏసీపీ నరసింహారెడ్డి అరెస్ట్..!

దిశ, వెబ్‎డెస్క్: మల్కాజ్‎గిరి ఏసీపీ నరసింహారెడ్డిని ఏసీబీ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలతో నరసింహారెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన బినామీల ఇంట్లో అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. మహీంద్రాహిల్స్ లోని నరసింహారెడ్డి నివాసంలో బుధవారం రాత్రి వరకు సోదాలు నిర్వహించి.. అనంతరం ఆయనను నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఇవాళ వైద్య పరీక్షల నిమిత్తం నరసింహారెడ్డిని ఆస్పత్రికి తరలించారు. నరసింహారెడ్డి బంధువుల ఇంట్లో ఏకకాలంలో 12 చోట్ల తనిఖీలు […]

Update: 2020-09-24 03:11 GMT

దిశ, వెబ్‎డెస్క్: మల్కాజ్‎గిరి ఏసీపీ నరసింహారెడ్డిని ఏసీబీ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలతో నరసింహారెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన బినామీల ఇంట్లో అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. మహీంద్రాహిల్స్ లోని నరసింహారెడ్డి నివాసంలో బుధవారం రాత్రి వరకు సోదాలు నిర్వహించి.. అనంతరం ఆయనను నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఇవాళ వైద్య పరీక్షల నిమిత్తం నరసింహారెడ్డిని ఆస్పత్రికి తరలించారు.

నరసింహారెడ్డి బంధువుల ఇంట్లో ఏకకాలంలో 12 చోట్ల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో రూ.70 కోట్ల అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్‎లో 3 ఇళ్లు, 5 ఇంటి స్థలాలు ఉన్నట్టు వెల్లడించారు. వైద్య పరీక్షల అనంతరం నరసింహారెడ్డిని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News