మలైకా సర్వ యోగ పాఠాలు

ఫిట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే మలైకా అరోరా.. ఎప్పటికప్పుడు యోగా పోజ్‌లు, ఫ్లెక్సిబిలిటీతో అభిమానులకు ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. ‘సర్వ యోగా స్టూడియోస్’ స్థాపించి యోగా పాఠాలు కూడా నేర్పుతోంది. జూన్ 21న ‘యోగా డే’ పురస్కరించుకుని ‘14 డేస్ 14 ఆసన్’ పేరుతో ప్రతీరోజు ఒక్కో ఆసనాన్ని పరిచయం చేస్తూ దాని లాభాలు వివరిస్తోంది. ప్రతీరోజు ఉదయం గంటపాటు తప్పనిసరిగా యోగా చేస్తానని చెబుతున్న ఈ ఐటెం బాంబ్.. ఆ సమయాన్ని కోల్పోవడం అసలు ఇష్టముండదని చెప్తోంది. […]

Update: 2020-06-10 04:44 GMT

ఫిట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే మలైకా అరోరా.. ఎప్పటికప్పుడు యోగా పోజ్‌లు, ఫ్లెక్సిబిలిటీతో అభిమానులకు ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. ‘సర్వ యోగా స్టూడియోస్’ స్థాపించి యోగా పాఠాలు కూడా నేర్పుతోంది. జూన్ 21న ‘యోగా డే’ పురస్కరించుకుని ‘14 డేస్ 14 ఆసన్’ పేరుతో ప్రతీరోజు ఒక్కో ఆసనాన్ని పరిచయం చేస్తూ దాని లాభాలు వివరిస్తోంది. ప్రతీరోజు ఉదయం గంటపాటు తప్పనిసరిగా యోగా చేస్తానని చెబుతున్న ఈ ఐటెం బాంబ్.. ఆ సమయాన్ని కోల్పోవడం అసలు ఇష్టముండదని చెప్తోంది. తను రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేసే ఆసనాలను పోస్ట్ చేస్తూ ‘ఆసనం ఎలా వేయాలి.. దాని వల్ల లాభాలేంటి? అనేది కూడా వివరిస్తోంది. ఇంట్లో ఆసనం ట్రై చేసి ఆ ఫోటోలను తనకు పంపించాలని అభిమానులను కోరుతోంది. 14 డేస్ 14 ఆసన్‌లో భాగంగా ‘హలాసనం’ ఎలా వేయాలనే విధానాన్ని తన పోస్ట్‌లో వివరించిన మలైకా ఈ ఆసనం నాడీ వ్యవస్థను శాంతింపజేస్తుందని తెలిపింది. శరీరం నుంచి విషపదార్థాలు బయటకు వచ్చేలా చేసి మనసుకు శాంతినిస్తుందని వివరించింది.

Tags:    

Similar News