వారికి మహీంద్రా కొనుగోళ్లలో ప్రత్యేక ప్రయోజనాలు!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా గురువారం వాహనాల కొనుగోళ్లపై వివిధ ప్రయోజనాలను ప్రకటించింది. వీటిలో అదనపు నగదు తగ్గింపు, తక్కువ వడ్డీ రేట్లు, ఈజీ ఈఎంఐలు ఉన్నాయి. ‘సర్కార్ 2.0’ పేరుతో ప్రారంభించిన ఈ పథకంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులందరూ రూ.11,500 వరకూ అదనపు నగదు తగ్గింపును, జీరో ప్రాసెసింగ్ ఫీజు, 7.25 శాతం నుంచి తక్కువ వడ్డీ రేట్లకు అర్హులవుతారని కంపెనీ వెల్లడించింది. పండుగ సీజన్ ప్రయోజనాలలో […]

Update: 2020-11-05 09:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా గురువారం వాహనాల కొనుగోళ్లపై వివిధ ప్రయోజనాలను ప్రకటించింది. వీటిలో అదనపు నగదు తగ్గింపు, తక్కువ వడ్డీ రేట్లు, ఈజీ ఈఎంఐలు ఉన్నాయి. ‘సర్కార్ 2.0’ పేరుతో ప్రారంభించిన ఈ పథకంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులందరూ రూ.11,500 వరకూ అదనపు నగదు తగ్గింపును, జీరో ప్రాసెసింగ్ ఫీజు, 7.25 శాతం నుంచి తక్కువ వడ్డీ రేట్లకు అర్హులవుతారని కంపెనీ వెల్లడించింది. పండుగ సీజన్ ప్రయోజనాలలో భాగంగా ఫైనాన్స్ సంస్థల భాగస్వామ్యంతో ఈఎంఐ చెల్లింపులను గరిష్టంగా 8 ఏళ్ల వరకు ఇవ్వనున్నట్టు కంపెనీ పేర్కొంది.

అదేవిధంగా వ్యక్తిగత వినియోగానికి వాహనాలను కొనుగోలు చేసే వారికి రూ.లక్షకు రూ. 799 తక్కువ ఈఎంఐ ప్రయోజనాన్ని ఇస్తున్నట్టు ప్రకటనలో తెలిపింది. ఈ పథకాలను వివిధ ఆర్థిక సంస్థల ద్వారా అందించనున్నట్టు, ఈ ఆఫర్లను పొందటానికి వినియోగదారులు సమీప డీలర్‌ను సంప్రదించాలని కంపెనీ వివరించింది. అంతేకాకుండా, ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీల భాగస్వామ్యంతో తక్షణ ఈఎంఐ సౌకర్యాలతో పాటు కాంటాక్ట్‌లెస్ చెల్లింపుల సౌలభ్యాన్ని సంస్థ ఏర్పాటు చేసిందని తెలిపింది.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News