ఆఫీస్‌కు గుర్రం ఎక్కి వస్తానన్న ఉద్యోగి.. వద్దన్న కలెక్టర్ 

దిశ, ఫీచర్స్: లాక్‌డౌన్ తర్వాత నిత్యవసరాల వస్తువుల నుంచి ఇళ్ల స్థలాల వరకు అన్ని ధరలు గణనీయంగా పెరిగాయి. ఇక పెట్రోల్, డిజీల్ రేట్ల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. దాంతో ఆఫీస్‌కు బైక్‌పై పోయి రావాలంటే జంకే పరిస్థితి వచ్చింది. పెట్రోల్ ధరలు ఇలానే పెరిగితే, గతంలో లాగా అందరూ మళ్లీ సైకిల్ వాడే పరిస్థితి కూడా రావొచ్చు. అయితే మహారాష్ట్ర, నాందేడ్‌కు చెందిన ఓ ఉద్యోగి మాత్రం తన ఆఫీస్‌కు వెళ్లి రావడానికి ‘గుర్రాన్ని’ తీసుకెళ్తానని, […]

Update: 2021-03-08 07:59 GMT

దిశ, ఫీచర్స్: లాక్‌డౌన్ తర్వాత నిత్యవసరాల వస్తువుల నుంచి ఇళ్ల స్థలాల వరకు అన్ని ధరలు గణనీయంగా పెరిగాయి. ఇక పెట్రోల్, డిజీల్ రేట్ల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. దాంతో ఆఫీస్‌కు బైక్‌పై పోయి రావాలంటే జంకే పరిస్థితి వచ్చింది. పెట్రోల్ ధరలు ఇలానే పెరిగితే, గతంలో లాగా అందరూ మళ్లీ సైకిల్ వాడే పరిస్థితి కూడా రావొచ్చు. అయితే మహారాష్ట్ర, నాందేడ్‌కు చెందిన ఓ ఉద్యోగి మాత్రం తన ఆఫీస్‌కు వెళ్లి రావడానికి ‘గుర్రాన్ని’ తీసుకెళ్తానని, అందుకోసం పార్కింగ్ ప్లేస్ ఇవ్వాలని కలెక్టర్‌కు లేఖ రాశాడు. ఆ లేఖ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

https://twitter.com/ss_suryawanshi/status/1367124463033049089?s=20

నాందేడ్ జిల్లా కలెక్టరేట్‌లో గ్యారెంటీ స్కీమ్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ ఆడిటర్‌ సతీష్ దేశ్‌ముఖ్. తనకు విపరీతమైన బ్యాక్ పెయిన్ వస్తుందని, అందువల్ల టూ వీలర్ మీద ఆఫీసుకు రావడం ఇబ్బందిగా ఉందని, అందువల్ల గుర్రం మీద ఆఫీసుకు రావాలని అనుకుంటున్నానని సతీష్ కలెక్టర్‌కు లేఖ రాశాడు. అంతేకాదు తాను గుర్రం కొనుక్కుని రోజు గుర్రంపై ఆఫీసుకు వస్తానని విన్నవించాడు. అయితే సతీష్ లేఖ రాసింది నిజమేనని, తనకు ఆ లెటర్ అందిందని జిల్లా కలెక్టర్ విపిన్ ఇతంకర్ తెలిపారు. అయితే అతడి విజ్ఞప్తిని మాత్రం తోసిపుచ్చారు ఎందుకంటే..ఆఫీసుకు గుర్రంపై రావడం దేశంలో ఎక్కడా లేదని, ఇప్పటికే వెన్నునొప్పితో బాధపడుతున్నప్పుడు గుర్రపు స్వారీ చేయడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తుందని అందుకే అనుమతి ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పేశారు. దాంతో సతీష్ తన అభ్యర్థనను ఉపసంహరించుకున్నాడు.

 

Tags:    

Similar News