రాష్ట్రపతికి కరోనా అంటించేందుకు వాళ్లను పంపారు

దిశ, ఏపీ బ్యూరో: ఒకాయన ఆస్తులు కాపాడుకునేందుకు, మరొకాయన తన చిన్నాన్నను కాపాడుకునేందుకు రాష్ట్రపతిని కలిశారంటూ వైఎస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎంపీలు రాష్ట్రపతిని కలవడంపై ఆయన మాట్లాడుతూ, రాష్ట్రపతికి కరోనా అంటించేందుకు చంద్రబాబు తన ఎంపీలను ఆయన వద్దకు పంపారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిధుల వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం నిజాయతీతో నిక్కచ్చిగా వ్యవహరిస్తోందని, అలాంటి ప్రభుత్వంపై అసత్యాలతో కూడిన తప్పుడు నివేదికను రాష్ట్రపతికి టీడీపీ నేతలు సమర్పించారని ఆయన […]

Update: 2020-07-17 01:24 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఒకాయన ఆస్తులు కాపాడుకునేందుకు, మరొకాయన తన చిన్నాన్నను కాపాడుకునేందుకు రాష్ట్రపతిని కలిశారంటూ వైఎస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎంపీలు రాష్ట్రపతిని కలవడంపై ఆయన మాట్లాడుతూ, రాష్ట్రపతికి కరోనా అంటించేందుకు చంద్రబాబు తన ఎంపీలను ఆయన వద్దకు పంపారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిధుల వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం నిజాయతీతో నిక్కచ్చిగా వ్యవహరిస్తోందని, అలాంటి ప్రభుత్వంపై అసత్యాలతో కూడిన తప్పుడు నివేదికను రాష్ట్రపతికి టీడీపీ నేతలు సమర్పించారని ఆయన విమర్శించారు. పోలీసు విచారణలో నేరం రుజువైతే కోర్టు అనుమతితోనే ఎవరినైనా జైల్లో పెడతారని ఆయన పేర్కొన్నారు. అచ్చెన్నాయుడుపై కేసులతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్న మాధవ్, గల్లా జయదేవ్ ఆస్తులు ఏ రకంగా కూడబెట్టారని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులను ఏ రకంగా దుర్వినియోగం చేశారో అందరికీ తెలుసన్నారు

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News