గణేశ్ నిమజ్జనంపై కఠిన నిబంధనలు
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా మహమ్మారి పండుగలపై తీవ్ర ప్రభావం చూపింది. మార్చిలో లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి పండుగను దేశ ప్రజలు ఇళ్లలోనే జరుపుకుంటున్నారు. ఆగస్టులో రాబోతున్న గణేష్ ఉత్సవాలపై కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నందున గణేష్ ఉత్సవాలకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గణేష్ ఉత్సవాలకు సంబంధించి కొన్ని నిబంధనలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే ముంబయి […]
దిశ, వెబ్‌డెస్క్ :
కరోనా మహమ్మారి పండుగలపై తీవ్ర ప్రభావం చూపింది. మార్చిలో లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి పండుగను దేశ ప్రజలు ఇళ్లలోనే జరుపుకుంటున్నారు. ఆగస్టులో రాబోతున్న గణేష్ ఉత్సవాలపై కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నందున గణేష్ ఉత్సవాలకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గణేష్ ఉత్సవాలకు సంబంధించి కొన్ని నిబంధనలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ గణేష్ నిమజ్జనానికి సంబంధించి ముంబయి ప్రజలకు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది.
గణేష్ విగ్రహాల ఊరేగింపు, నిమజ్జనంలో ఐదుగురు మాత్రమే పాల్గొనాలని తెలిపింది. అలాగే మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించింది. ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బీఎంసీ హెచ్చరించింది. ముంబయిలో కరోనా కేసులు ఇప్పటికే లక్ష దాటాయి. రాష్ట్రంలో కేసులు పెరుగుతూనే ఉండటంతో.. బీఎంసీ(బ్రిహాన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.