పాతబస్తీలో మతకలహాలు సృష్టించేందుకు అమిత్ షా కుట్ర: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి

ఓల్డ్ సిటీలో మత కలహాలు సృష్టించడానికే అమిత్ షా తాజాగా రజాకార్లు అనే పదాన్ని ఉపయోగిస్తూ విమర్శలు చేశాడని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మహ్మద్ వలీవుల్లా సమీర్ అన్నారు.

Update: 2024-05-02 14:40 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఓల్డ్ సిటీలో మత కలహాలు సృష్టించడానికే అమిత్ షా తాజాగా రజాకార్లు అనే పదాన్ని ఉపయోగిస్తూ విమర్శలు చేశాడని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మహ్మద్ వలీవుల్లా సమీర్ అన్నారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. అనవసర వివాదాలకు అమిత్​ షా ఆజ్యం పోస్తున్నాడన్నారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం చేస్తున్నారన్నారు. అందుకే బీజేపీ, ఎంఐఎంలను తరిమికొట్టేందుకు ప్రజలు రెడీగా ఉన్నారన్నారు. లోక్ సభ తీర్పుతో ఆ రెండు పార్టీలు భూస్థాపితం కానున్నాయన్నారు. హైదరాబాద్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర హోంమంత్రి విఫలమయ్యారని విమర్శించారు.

పాతబస్తీలో ముస్లీంలు, హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లతో పాటు వివిధ వర్గాల ప్రజలు నివసిస్తున్నారని, బీజేపీ ఇష్టారీతిన మత విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదన్నారు. తాను కాంగ్రెస్ అభ్యర్థిగా, సామాన్య ప్రజల నిజమైన మనోవేదనలను పరిష్కరించడంపై ఫోకస్ పెడతానన్నారు. అభివృద్ధి, ఉద్యోగాల కల్పన, విద్య, వైద్యంతో పాటు పార్టీ గ్యారంటీలను వివరిస్తాననన్నారు. కానీ ఈ రెండు పార్టీల ప్రజల మధ్య పంచాయితీ పెట్టి ఓట్లు పొందాలని చూస్తున్నాయని మండిపడ్డారు.

Read More..

హరీష్ రావు నుంచి సిద్దిపేటకు విముక్తి కల్పిస్తా.. CM రేవంత్ ప్రకటన 

Tags:    

Similar News