పత్తి పంటపై మిడతల దాడి

దిశ, సంగారెడ్డి: సకాలంలో వాతావరణం అనుకూలించడంతో ఈసారి పంట బాగా పడుతుందని రైతులు ఆనందపడుతున్న సమయంలో మిడతల దండు వారిని కలవరానికి గురి చేస్తోంది. సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గం మండలంలోని ముస్లాపూర్ గ్రామంలో పత్తి పంటపై మిడతల దండు దాడి చేసింది. బహిరన్ దెబ్బ గ్రామానికి చెందిన నడిపొల్ల బాలయ్య తన రెండు ఎకరాలలో పత్తి పంట వేశాడు. అదే గ్రామానికి చెందిన రైతు బీరప్ప తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్తుండగా బాలయ్య పొలంలో మిడతల గుంపు […]

Update: 2020-07-29 02:28 GMT

దిశ, సంగారెడ్డి: సకాలంలో వాతావరణం అనుకూలించడంతో ఈసారి పంట బాగా పడుతుందని రైతులు ఆనందపడుతున్న సమయంలో మిడతల దండు వారిని కలవరానికి గురి చేస్తోంది. సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గం మండలంలోని ముస్లాపూర్ గ్రామంలో పత్తి పంటపై మిడతల దండు దాడి చేసింది.

బహిరన్ దెబ్బ గ్రామానికి చెందిన నడిపొల్ల బాలయ్య తన రెండు ఎకరాలలో పత్తి పంట వేశాడు. అదే గ్రామానికి చెందిన రైతు బీరప్ప తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్తుండగా బాలయ్య పొలంలో మిడతల గుంపు వాలి ఉండటాన్ని గమనించాడు. వెంటనే సర్పంచ్ లక్ష్మమ్మకు సమాచారం అందించడంతో.. ఆమె వ్యవసాయ అధికారులకు విషయం తెలియజేసింది. ఈ మేరకు ఏవో నాగమణి సూచనలతో వాటిని చంపేందుకు యత్నించగా విఫలమైంది. ఈ విషయమై ఏవోను సంప్రదించగా డాట్ కేంద్రం నుంచి వ్యవసాయ శాస్త్రవేత్తలు వచ్చి పరిశీలిస్తారని తెలిపారు.

Tags:    

Similar News