ట్రైన్‌లో జనరల్ కంపార్ట్ మెంట్లు ఫస్ట్ అండ్ లాస్టులో మాత్రమే ఎందుకు ఉంటాయి?

ఏమాత్రం సెలవులు వచ్చినా పలువురు తమ సొంత గ్రామాలకో, పర్యాటక ప్రాంతాలకో వెళ్లడానికి ట్రైన్లల్లో ప్రయాణిస్తుంటారు. అలాగే వివిధ పనులు, ఉద్యోగాల నిమిత్తం కూడా కొందరు రైళ్లలో జర్నీ చేస్తుంటారు. అవసరాలను బట్టి అనేక మంది ప్రతిరోజూ రాకపోకలు కొనసాగిస్తుంటారు.

Update: 2024-05-25 13:04 GMT

దిశ, ఫీచర్స్ : ఏమాత్రం సెలవులు వచ్చినా పలువురు తమ సొంత గ్రామాలకో, పర్యాటక ప్రాంతాలకో వెళ్లడానికి ట్రైన్లల్లో ప్రయాణిస్తుంటారు. అలాగే వివిధ పనులు, ఉద్యోగాల నిమిత్తం కూడా కొందరు రైళ్లలో జర్నీ చేస్తుంటారు. అవసరాలను బట్టి అనేక మంది ప్రతిరోజూ రాకపోకలు కొనసాగిస్తుంటారు. అయితే ఇటీవల ప్రయాణికులు పెరగడం, జనరల్ భోగీలు కిక్కిరిసిపోవడం వంటి అంశాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అయితే సాధారణంగా జనరల్ కంపార్టమెంట్స్ ఫస్ట్ అండ్ లాస్టులో మాత్రమే ఎందుకు ఉంటాయి? మధ్యలో ఎందుకు ఉండవు? అనే సందేహాలు కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు. అందుకు గల కారణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తవానికి ఇండియన్ రైల్వే నెట్‌వర్క్ చాలా పెద్దది. డైలీ లక్షలాదిమంది రాకపోకలు కొనసాగిస్తుంటారు. సేఫ్ అండ్ సెక్యూరిటీ పరంగానూ రైలు ప్రయాణం మంచిదని చాలామంది భావిస్తుంటారు. అయితే రైళ్లల్లో ప్రయాణికుల కోసం ఏసీ కోచ్‌లు, జనరల్ కోచ్‌లు, స్లీపర్‌ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. ఖర్చు తక్కువ కావడం, అలాగే తక్కువ దూరం ప్రయాణించడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని చాలామంది జనరల్ కోచ్ ప్రయాణాలకు మొగ్గు చూపుతుంటారు.

ప్రతీ స్టేషన్‌లోనూ జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ఎక్కేవారు, దిగేవారు కచ్చితంగా ఉంటారు. మిగతా కంపార్ట్‌మెంట్లలో ఆ పరిస్థితి ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో రైలు మధ్యలో జనరల్ కోచ్‌లు వేస్తే ఇక్కడ అధిక బరువు వల్ల ట్రైన్‌ మొత్తంలో బ్యాలెన్స్‌ సరిగ్గా ఉండదు. పైగా బోర్డింగ్ అండ్ డిబోర్డింగ్‌లో కూడా సమస్యలు వస్తాయి. అదే జనరల్ కంపార్ట్‌మెంట్ మధ్యలో ఉంటే, అది సీటింగ్ అమరికతో పాటు ఇతర ఏర్పాట్లపై ప్రభావం చూపుతుంది. ప్రయాణికుల రద్దీ సమానంగా విభజించబడి ఉంటుంది. రెండు వైపులా కూడా ఇంజన్లను కనెక్ట్ చేయడం వల్ల రైలు బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయడంలో సహాయపడుతుంది. దీంతోపాటు ట్రైన్ ప్రారంభంలో లేదా చివరలో జనరల్ కోచ్‌ను జోడించడం సేఫ్టీ పరంగానూ బెనిఫిట్స్ ఉంటాయి. అందుకే జనరల్ కోచ్‌లు ట్రైన్లకు ఫస్ట్ అండ్ లాస్టులో కనెక్ట్ చేస్తారు. 

Similar News