వామ్మో! పెళ్లికి ముందే ఇంత ఫాస్టా?.. పీటల మీదే ఆ పని కానిచ్చేసిన వధువు.. (వీడియో)

సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే మరికొన్ని మాత్రం కాస్తంత వెరైటీగా ఉంటాయి.

Update: 2024-05-27 09:01 GMT

దిశ, ఫీచర్స్: సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే మరికొన్ని మాత్రం కాస్తంత వెరైటీగా ఉంటాయి. అయితే కొందరు పెళ్లిళ్లలో కావాలని చేస్తారో.. లేదా పబ్లిసిటీ కోసం చేస్తారో కానీ ఆ పెళ్లి ఘటనలు కాస్త ట్రెండింగ్ లో ఉంటాయి. తాజాగా, ఒక పెళ్లి వేడుక వైరల్ గా మారింది. దీనిలో ఒక వధువు ప్రవర్తించిన తీరును నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.

ఇందులో భాగంగా పెళ్లి వేడుకలో వరమాల కార్యక్రమం కూడా అయిపోయిన తర్వాత అతిథులు అందరూ వచ్చి విషెస్ చెప్పి వెళ్తున్నారు. కొత్త జంట ఒకరిని మరొకరు చూసుకుంటూ, నవ్వుకుంటున్నారు. కొత్త జంటకు చాలా మంది ఎవరికి తోచిన విధంగా గిఫ్ట్ లు, డబ్బులను చేతిలో ఇస్తున్నారు ఇదే క్రమంలో.. ఒక వ్యక్తి చేతిలో కొత్త జంటకు సపరేట్ గా డబ్బులు ఇచ్చాడు. అప్పుడు వధువు..తన డబ్బులను మాత్రం, పక్కన పెట్టుకుంది. అంతటితో ఆగకుండా వరుడి చేతిలో డబ్బులను కూడా మెల్లగా తీసుకుంది.

వరుడు పరధ్యానంలో ఉన్నట్టు నటించాడో లేదా నా భార్యే కదా..ఎవరి దగ్గర ఉంటే ఏమవుతుంది అనుకున్నాడో కానీ.. ఏవిధంగా కూడా రెస్పాండ్ కాలేదు. దీన్ని చూసిన నెటిజన్లు వావ్.. వధువు టాలెంట్ మాములుగా లేదుగా.. అంటూ మరికొందరు పీటల మీదే భర్తను తన మాటల్లో తెచ్చుకుందిగా అని ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

Read More...

వివాహ వేడుకకు వింత నియమాలు.. ఇంత కఠినమా? వైరల్‌గా మారిన ఇన్విటేషన్ కార్డ్  





Similar News